AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. ఎంతటి ఘోరం.. నలుగురి ప్రాణం తీసిన మూల మలుపు..!

బెంగళూరు నుంచి సొంతూరుకు వెళ్తుండగా ఘోరం. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కడప రిమ్స్ కు తరలించారు.

అయ్యో దేవుడా.. ఎంతటి ఘోరం.. నలుగురి ప్రాణం తీసిన మూల మలుపు..!
Road Accident In Kadapa District
Sudhir Chappidi
| Edited By: |

Updated on: May 24, 2025 | 12:59 PM

Share

కడప జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్ ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. దాదాపు 14 కిలోమీటర్ల పైబడి ఉండే ఈ ఘాట్‌లో పదికి పైగా మలుపులు ఉన్నాయి. ఆ మలుపుల వద్ద స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటన ఇప్పుడు మరొకటి జరిగింది. బెంగళూరు నుంచి బద్వేల్‌లోని సొంత గ్రామానికి వస్తున్న ఓ కుటుంబం మృత్యువాత పడింది. గువ్వలచెరువు ఘాట్ లోని చింతకొమ్మదిన్నె మండలం వైపు ఉన్న నాలుగో మలుపు వద్ద ప్రమాదం సంభవించింది. యూరియా లోడ్ తో వస్తున్న లారీ వెనుక నుంచి వచ్చి కారుపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కడప రిమ్స్ కు తరలించారు. బెంగళూరు నుండి బద్వేల్ మండలం చింతపుత్తలపల్లె కు గ్రామంలో శుభకార్యానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు నాలుగవ మలుపు వద్దకు కారు రాగానే వెనుక వైపు నుంచి యూరియా లోడ్ తో లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను శ్రీకాంత్, శిరీష్, హర్షిణి, రిషిగా పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు దాదాపు రెండు గంటలకు పైగా శ్రమించారు. మొత్తం 7 మంది కారులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యాక్సిడెంట్ ప్రదేశంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతదేహాలను వెలికి తీసి కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. గాయపడిన వారిని కూడా కడప రిమ్స్ కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్