TDP Vs YCP: చిత్తూరు జిల్లాలో హీట్ పుట్టిస్తోన్న దొంగఓట్ల రాజకీయం.. ఫేక్ ఓట్లపై కుప్పం వర్సెస్ పుంగనూరుగా బిగ్ ఫైట్

దొంగ ఓట్ల రచ్చ చిత్తూరు జిల్లాలో రాజకీయ యుద్ధానికే తెరతీస్తోంది. వైసీపీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ దొంగ ఓట్ల వ్యవహారాన్ని మరింత హైలెట్ చేసింది. చిత్తూరు జిల్లాలో చిరకాల రాజకీయ ప్రత్యర్థి గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి 2024 ఎన్నికలే లక్ష్యంగా కుప్పం లో వ్యూహాలు పన్నుతున్నారు.

TDP Vs YCP: చిత్తూరు జిల్లాలో హీట్ పుట్టిస్తోన్న దొంగఓట్ల రాజకీయం.. ఫేక్ ఓట్లపై కుప్పం వర్సెస్ పుంగనూరుగా బిగ్ ఫైట్
Tdp Vs Ycp

Edited By: Surya Kala

Updated on: Jul 25, 2023 | 6:54 AM

చిత్తూరు జిల్లాలో దొంగఓట్ల రాజకీయం హీట్ పుట్టిస్తోంది. కుప్పంలో వేలాది దొంగ ఓట్లను వైసీపీ ఎత్తి చూపుతుంటే పుంగనూరు ఫేక్ ఓట్ల సంగతేంటని టిడిపి ప్రశ్నిస్తోంది. కుప్పంలో చంద్రబాబును గెలిపిస్తున్నది మెజారిటీ తెప్పిస్తున్నది దొంగ ఓట్లే నంటున్న వైసీపీ ఫేక్ ఓట్ల ఏరివేతలో నిల్వ ఉంటే మరి పుంగనూరులో బయట పడుతున్న దొంగ ఓట్ల బాగోతమేంటని టిడిపి ప్రశ్నిస్తోంది. దీంతో ఫేక్ ఓట్ల పై కుప్పం వర్సెస్ పుంగనూరు గా బిగ్ ఫైట్ మారింది.

వైసీపీ వర్సెస్ టీడీపీ..

దొంగ ఓట్ల రచ్చ చిత్తూరు జిల్లాలో రాజకీయ యుద్ధానికే తెరతీస్తోంది. వైసీపీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి. కుప్పంపై మంత్రి పెద్దిరెడ్డి ఫోకస్ దొంగ ఓట్ల వ్యవహారాన్ని మరింత హైలెట్ చేసింది. చిత్తూరు జిల్లాలో చిరకాల రాజకీయ ప్రత్యర్థి గా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసిన మంత్రి పెద్దిరెడ్డి 2024 ఎన్నికలే లక్ష్యంగా కుప్పం లో వ్యూహాలు పన్నుతున్నారు. వరుసగా 7 సార్లు కుప్పం నుంచి ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో చెక్ చెప్పాలని కోరుతూ వైసీపీ కుప్పం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వై నాట్ 175 అంటున్న వైసీపీ హైకమాండ్ ఎలాగైనా కుప్పంలో గెలవాలి. దీంతో కుప్పంలో చంద్రబాబును కార్నర్ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు కంటే కుప్పం పైనే ఫోకస్ చేశారు. ఈ మధ్య సుడిగాలి పర్యటన చేస్తున్న పెద్దిరెడ్డి పల్లెబాట పేరుతో కుప్పం నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పల్లె పల్లె తిరుగుతున్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు గుడిపల్లి, శాంతిపురం మండలాల్లో నిలిచిన పెద్దిరెడ్డి ఇప్పుడు కుప్పం మండలంలో పల్లెబాట కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

చంద్రబాబు గెలుస్తోంది దొంగ ఓట్లతోనే..వైసీపీ. దొంగ ఓట్లే కుప్పంలో చంద్రబాబును కాపాడుతూ వస్తున్నాయంటూ విమర్శలు చేస్తున్న పెద్దిరెడ్డి ఇప్పటికే 17వేల ఓట్లను తొలగింపు జరిగిందంటున్నారు. మరో 26 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్టు గుర్తించామంటున్న పెద్దిరెడ్డి ఎన్నికల కమీషన్ కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. పక్క రాష్ట్రాల్లోని వారిని పెద్ద ఎత్తున చేర్చిన చంద్రబాబు ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తున్నది మెజార్టీ సాదిస్తున్నది భారీగా నమోదైన దొంగ ఓట్ల తోనే సాధ్యమైందని ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇది సాధ్యపడదంటున్న వైసీపీ హై కమాండ్ కూడా వై నాట్ 175 అంటోంది. కుప్పంలో వైసీపీ దే గెలుపంటోంది.

కుప్పం లో దొంగ ఓట్ల తొలగింపు సహకరిస్తాం.. మరి పుంగనూరు సంగతేంటి. టీడీపీ కుప్పంలో దొంగ ఓట్ల తొలగింపు పూర్తిగా సహకరిస్తామంటున్న టీడీపీ పుంగనూరులోని ఓట్ల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఓట్ల వెరిఫికేషన్ లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా బయట పడ్డాయని ఇందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల సంఘమే నిజాలను నిగ్గు తేల్చాలని కోరుతోంది. పుంగనూరులో 2 వేలకు పైగా ఓట్లు ఇంటి నంబర్లు లేకుండా నమోదయ్యాయని టీడీపీ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామంటోంది. కుప్పంలో 25 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయంటున్న మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో బయటపడ్డ దొంగ ఓట్లకు సమాధానమెంటో చెప్పాలంటోంది. కుప్పంలో దొంగ ఓట్లు తొలగించాలని అందుకు సహకరిస్తామంటున్న టీడీపీ నేతలు 12 వేలకు పైగా చనిపోయినవారి వివరాలు, బయట స్థిరపడ్డ వారి వివరాలను టీడీపీనే నంటోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సుమారు 10 వేలకు పైగా దొంగఓట్లు ఉన్నాయని కుప్పంలో తిరుగుతున్న మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కుప్పంలో దొంగ ఓట్లు తొలగించాలని అందుకు సహకరిస్తామంటున్న టీడీపీ నేతలు 12 వేలకు పైగా చనిపోయినవారి వివరాలు, బయట స్థిరపడ్డ వారి వివరాలను టీడీపీనే నంటోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సుమారు 10 వేలకు పైగా దొంగఓట్లు ఉన్నాయని కుప్పంలో తిరుగుతున్న మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పంలో దొంగ ఓట్లు తొలగించాలని అందుకు సహకరిస్తామంటున్న టీడీపీ నేతలు 12 వేలకు పైగా చనిపోయినవారి వివరాలు, బయట స్థిరపడ్డ వారి వివరాలను టీడీపీనే నంటోంది. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో సుమారు 10 వేలకు పైగా దొంగఓట్లు ఉన్నాయని కుప్పంలో తిరుగుతున్న మంత్రి పెద్దిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..