Fact Check: విజయవాడలో శివాలయం కూల్చివేశారా? వైరల్ అవుతున్న వీడియో.. అసలు నిజం ఇదీ..!

|

Aug 19, 2022 | 9:46 PM

Fact Check: రోడ్డును వెడల్పు చేసేందుకు విజయవాడలో శివుడి ఆలయాన్ని నేలమట్టం చేశారని, దాని ముందున్న మసీదును కనీసం తాకనైనా తాకలేదంటూ..

Fact Check: విజయవాడలో శివాలయం కూల్చివేశారా? వైరల్ అవుతున్న వీడియో.. అసలు నిజం ఇదీ..!
Fact Check
Follow us on

Fact Check: రోడ్డును వెడల్పు చేసేందుకు విజయవాడలో శివుడి ఆలయాన్ని నేలమట్టం చేశారని, దాని ముందున్న మసీదును కనీసం తాకనైనా తాకలేదంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం చేసుకుని ఈ వీడియో ట్రోల్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఫ్యాక్ట్ చెక్‌లో ఫేక్ అని తేలింది. ఇది 2020 కి సంబంధించిన వీడియో కాగా, ఆలయ పునర్నిర్మాణం కోసం కూల్చివేశారు. కూల్చివేతల అనంతరం ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అక్కడ శివాలయం మహాద్భుతంగా ఉందని, దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఫ్యాక్ట్ చెక్.

విజయవాడలోని శ్రీ విజయేశ్వర ఆలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కూల్చివేతలు జరిగాయి. ఆలయ విస్తీర్ణం పెంచేందుకు గాను కూల్చివేశారని అదికారులు నివేదించారు. ఆలయాన్ని పునరుద్ధరించారు కానీ, పక్కనే ఉన్న మసీదును పునరుద్ధరించలేదని స్థానికులు చెప్పారు. విజయేశ్వర ఆలయం, మసీదు ఎదురెదురుగా ఇప్పటికీ ఉన్నాయి. ఫైనల్‌గా తేలిందేంటంటే.. రోడ్ల వెడల్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాలను కూల్చివేస్తుందంటూ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి ఫేక్ వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..