Andhra Pradesh: ఉపాధి పనులు చేస్తుండగా పేలుడు.. భయంతో కూలీల పరుగులు..!
Andhra Pradesh: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం స్వయంభు వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాంసాగర్ చెరువు నుండి మధు చెరువు వరకు కాలువ పూడిక తీత పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 55 మంది కూలీలు..

Andhra Pradesh: అనకాపల్లి జిల్లా ఉపాధి పనుల్లో భాగంగా కూలీలంతా ఉదయాన్నే ఒక్క చోట చేరారు. చెరువు పూడిక తీత పనుల కోసం సిద్ధమయ్యారు. ఎవరికి అప్పగించినపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా పేలుడు. భారీ శబ్దంతో ఒక్కసారిగా గుండెలు పగిలేంత పనైంది. ఓ మహిళా కూలి తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయింది. అంతా ఆమె వైపు పరుగులు తీశారు. చూసేసరికి కంటి నుంచి రక్తం కారుతోంది. హుటాహుటిన అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. కంటి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె కంటికి సర్జరీ చేయాలని వైద్యులు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి క్లూస్ టీం సిబ్బందితో చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పేలిన వస్తువు పందుల వేట కోసం పెట్టే నాటు బాంబుగా ప్రాథమికంగా గుర్తించారు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం స్వయంభు వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాంసాగర్ చెరువు నుండి మధు చెరువు వరకు కాలువ పూడిక తీత పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 55 మంది కూలీలు ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా ఉదయం 9.30 గంటలకు కాలువతీత పనులు ప్రారంభించారు. వారిలో పనిచేస్తున్న తుంపాల లక్ష్మి అప్పల నరసమ్మ అనే 46 ఏళ్ల మహిళ కూలీ.. పూడిక మట్టిని పారతో తవ్వుతోంది. ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
పేలుడుతో నరసమ్మ కళ్ళకు రక్తగాయలవగా.. వెంటనే శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్ను గాయపడినట్టు..ఎడమ కన్ను కి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. చాలా కాలం క్రితం పందులు కోసం పెట్టిన నాటుబాంబే పెట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పరవాడ పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




