AP Politics: ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు.. గంటా శ్రీనివాసరావుతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖలో కాపు మీటింగ్‌కు ముందు విజయవాడలో గంటా శ్రీనివాసరావుతో.. బోండా ఉమ, ఎడం బాలాజీ భేటీ అవ్వడం ప్రధాన్యం సంతరించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖలో కాపు మీటింగ్‌కు ముందు విజయవాడలో గంటా శ్రీనివాసరావుతో.. బోండా ఉమ, ఎడం బాలాజీ భేటీ అవ్వడం ప్రధాన్యం సంతరించుకుంది. ఈ భేటీకి కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. గంటా దాదాపు మూడు గంటల పాటు కన్నాతో చర్చలు జరిపారు. రాజకీయాలు, కాపు మీటింగ్‌పై చర్చించినట్టు సమాచారం. అంతకుముందు గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను జనసేన నేత నాదెండ్ల మనోహర్ కలిశారు. గంటా బర్త్‌డేకి కలవనందుకే ఇప్పుడు కలిసి కేట్ కట్ చేశామంటూ ఈ నేతలు పేర్కొన్నారు. కానీ దీని వెనుక రాజకీయ పరిణామం ఉన్నట్లు పేర్కొంటున్నారు.
అయితే, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదంటూ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గంటాతో భేటీ అనంతరం కన్నా లక్ష్మీనారాయణ టీవీ9 తో మాట్లాడారు. గంటా శ్రీనివాసరావుతో తో కేవలం భోజనం మీటింగ్ మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదంటూ తెలిపారు.
అయితే, ఈ నాయకులు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ సమావేశానికి వంగవీటి రాధా కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.




మరిన్ని ఏపీ వార్తల కోసం..
