Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: అంగన్ వాడీ ఆయా పైశాచికం.. అల్లరి చేస్తోందని ముఖంపై అగ్గిపుల్లతో వాతలు..

పిల్లల ఆలానాపాలనా చూడాల్సిన అంగన్ వాడీ ఆయా విచక్షణ కోల్పోయింది. చిన్నారి అల్లరి చేస్తోందన్న కారణంతో ముఖంపై అగ్గిపుల్లతో వాతలు పెట్టింది. ఈ ఘటనలో చిన్నారికి గాయాలయ్యాయి. విషయం...

Visakhapatnam: అంగన్ వాడీ ఆయా పైశాచికం.. అల్లరి చేస్తోందని ముఖంపై అగ్గిపుల్లతో వాతలు..
Child Injured Matchstick
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 15, 2022 | 10:29 AM

పిల్లల ఆలానాపాలనా చూడాల్సిన అంగన్ వాడీ ఆయా విచక్షణ కోల్పోయింది. చిన్నారి అల్లరి చేస్తోందన్న కారణంతో ముఖంపై అగ్గిపుల్లతో వాతలు పెట్టింది. ఈ ఘటనలో చిన్నారికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయా ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం నగర పరిధిలోని సీతంపేట కనకమ్మవారి వీధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారి కుమార్తె రోజూ అంగన్ వాడీకి వెళ్తుండేది. ఈ క్రమంలో బుధవారం ఉదయం రోజూవారి మాదిరిగా అంగన్ వాడీకి వెళ్లిన చిన్నారిపై ఆయా.. అమానుషంగా ప్రవర్తించింది. పిల్లలకు ఆటలు, పాటలు నేర్పుతున్న సమయంలో ఆ బాలిక అల్లరి చేస్తుందని కోపం తెచ్చుకుంది ఆయా. దీంతో ముందు వెనకా ఆలోచించకుండా అగ్గిపుల్ల వెలిగించి ముఖంపై చురకలు అంటించింది. దీంతో బాలిక తీవ్ర నొప్పితో విలవిల్లాడిపోయింది. బాధను తట్టుకోలేక గట్టిగా ఏడ్చింది.
వెంటనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆయాను నిలదీశారు. చిన్నారులతో ఇలాగేనా ప్రవర్తించేదని మండిపడ్డారు. అయితే.. ఇదే కేంద్రం పై అంతస్తులో సీడీపీఓ కార్యాలయం ఉండడం గమనార్హం. అక్కడే ఇలాంటి సంఘటన జరిగితే ఇతర కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉందోనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సూపర్‌ వైజర్‌ను బాలిక ఇంటికి పంపించి విచారణ చేస్తున్నామని, నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామని సీడీపీఓ జి.శ్రీలత తెలిపారు.