AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ‘నాన్న.. నేను ఏ తప్పూ చేయలేదు’.. విద్యార్థిని సూసైడ్ నోట్ చదివితే కన్నీళ్లు పెట్టాల్సిందే..

ఆ యువతి పేరు రేణుక.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన రేణుక మాచర్లలోని న్యూటన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దీ రోజుల క్రితమే వేసవి సెలవుల నుంచి కాలేజ్ కు వచ్చిన రేణుక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

Andhra Pradesh: ‘నాన్న.. నేను ఏ తప్పూ చేయలేదు’.. విద్యార్థిని సూసైడ్ నోట్ చదివితే కన్నీళ్లు పెట్టాల్సిందే..
Crime News
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 06, 2024 | 9:15 PM

Share

ఆ యువతి పేరు రేణుక.. కర్నూలు జిల్లా డోన్ కు చెందిన రేణుక మాచర్లలోని న్యూటన్స్ కాలేజ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. రెండు రోజుల క్రితం హాస్టల్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్దీ రోజుల క్రితమే వేసవి సెలవుల నుంచి కాలేజ్ కు వచ్చిన రేణుక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తండ్రి గౌరప్ప ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు ఆమె రాసిన సూసైడ్ లేఖ లభించింది. దీంతో తండ్రి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతోనే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

రేణుక కాలేజ్‌లో చదివే యువకుడిని అన్నగా భావిస్తూ ఉంటుంది. అతను తరుచూ రేణుకతో మాట్లాడుతుంటాడు. అయితే నాలుగు రోజుల క్రితం రేణుకకు ఆ యువకుడు ఫోన్ చేశాడు. అయితే, బిజీగా ఉన్న రేణుక ఫోన్ తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన యువకుడు వెంటనే ఆమె తండ్రికి ఫోన్ చేసి రేణుక ఫోన్ తీయని విషయం చెప్పాడు. దీంతో తండ్రి గౌరప్ప వెంటనే ఆమెకు ఫోన్ చేసి మందలించాడు. కాలేజ్‌లో చదువుకునే అమ్మాయికి అబ్బాయిలతో పనేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రేపు కాలేజ్ వద్దకు వచ్చి అసలు విషయాన్ని తేల్చేస్తానన్నాడు. ఆమె ఎంత చెబుతున్నా వినకుండా కోపంతో కేకలు వేశాడు..

ఆ తర్వాత రోజు రేణుక కాలేజ్‌కు వెళ్లలేదు. తండ్రి మాత్రం డోన్ నుండి కాలేజ్ వద్దకు వచ్చాడు. రేణుక గురించి స్నేహితులు విచారించగా.. ఆమె కోసం వెతకగా హాస్టల్ లోని ఒక రూంలో ఉరివేసుకొని చనిపోయి ఉంది. దీంతో ఆమె తండ్రికి సమాచారం ఇచ్చిన స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

Note

అయితే, పోలీసుల విచారణలో ఆమె రాసిన సూసైడ్ లేఖ బయటపడింది. ‘‘నాన్న మీరే నా ధైర్యం.. నువ్వే నన్ను నమ్మకుంటే ఎలా.. నువ్వే నన్ను నమ్మకుంటే.. ఎవరు నమ్ముతారు.. సారీ నాన్న’’ అంటూ ఆమె లెటర్ లో రాసింది.. ఆ అన్న చాలా మంచోడు నన్ను అమ్మలా భావిస్తాడు. అతని తప్పేమి లేదంటూ రాసింది. దీంతో తండ్రితో జరిగిన ఫోన్ సంభాషతోనే ఆమె మనస్థాపానికి గురైనట్లు భావిస్తున్నారు. తండ్రి కాలేజ్ కు వస్తాననటంతో మరింత ఆందోళనకు గురైన రేణుక ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేప్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..