Andhra Pradesh: నడిరోడ్డుపై విమానాల రన్‌వే.. యుద్ధం వస్తే ఇక్కడే ల్యాండింగ్!
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రేణంగివరం, సింగరాయకొండ దగ్గర 16వ నెంబరు జాతీయ రహదారిపై అత్యవసర ఎయిర్ ప్యాడ్ నిర్మాణం పూర్తి అయ్యింది. కోస్తాతీర ప్రాంతానికి సమీపంలో రెండు రన్‌వేలు.. ఉగ్రదాడులు, విపత్తులు, యుద్ధ సమయంలో సైనిక చర్యలు, సహాయం కోసం.. 2022లో రెండుసార్లు ట్రయల్ రన్ పూర్తి చేశారు ఎయిర్‌ఫోర్స్ అధికారులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రేణంగివరం, సింగరాయకొండ దగ్గర 16వ నెంబరు జాతీయ రహదారిపై అత్యవసర ఎయిర్ ప్యాడ్ నిర్మాణం పూర్తి అయ్యింది. కోస్తాతీర ప్రాంతానికి సమీపంలో రెండు రన్‌వేలు.. ఉగ్రదాడులు, విపత్తులు, యుద్ధ సమయంలో సైనిక చర్యలు, సహాయం కోసం.. 2022లో రెండుసార్లు ట్రయల్ రన్ పూర్తి చేశారు ఎయిర్‌ఫోర్స్ అధికారులు.
జాతీయ రహదారిపై వాహనాల్లో ప్రయాణిస్తుంటాం.. అకస్మాత్తుగా రోడ్డుపై విమానం ఎగురుతూ ల్యాండ్ అవుతుంటే ఎలాగుంటుంది.. ఆటో స్టాండ్‌లాగా విమానాలకు కూడా మన రహదారుల పక్కనే చోటు కేటాయిస్తే ఏమనిపిస్తోంది. ఇవేమీ ఊహాజనితం కాదు.. కళ్లెదుటే రూపుదిద్దుకుంటున్న వాస్తవాలు. సామాన్యులకు విమానాశ్రయాల సందర్శన నెరవేరని కలే.. దగ్గర నుంచి విమానం చూడాలంటే విమానాశ్రయానికి వెళ్ళాల్సిందే.. అలా కాకుండా విమానం చూడాలంటే ఎప్పుడైనా అది ఆకాశంలో వెళ్తున్పప్పుడు మాత్రమే. అయితే 16వ నెంబర్ జాతీయ జాతియ రహదారిపై గ్రామాల పక్కనే విమానాల ల్యాండింగ్, పార్కింగ్ కోసం మూడేళ్ళ క్రితం పూర్తి చేసిన ఏర్పాట్లు తాజాగా భారత్, పాక్‌ల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడటంతో ఈ ఎమర్జెన్సీ ఎయిర్ స్ట్రిప్‌లు ఇప్పుడు ఆశక్తిగా మారాయి.
ఉమ్మడి ప్రకాశంజిల్లాలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రెండు అత్యవసర విమాన, హెలికాప్టర్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మాణం పూర్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడి నుంచి విమానాలు, హెలికాప్టర్లు టేక్‌ఆఫ్ చేసేందుకు, నడిపేందుకు సిద్దంగా ఉంచారు. 16వ నంబరు జాతీయ రహదారిపై ప్రకాశం జిల్లా సింగరాయకొండ పరిధిలో కనుమళ్ళ రోడ్డు నుంచి కందుకూరు అండర్ పాస్ వరకు.. అలాగే బాపట్ల జిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు రన్‌వే నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి రెండు ప్రముఖ సంస్థలు తమ పనులు ఇప్పటికే పూర్తి చేశాయి. ఈరెండు రోడ్ కం రన్‌వేలలో తొలుత బాపట్లజిల్లా కొరిశెపాడు నుంచి రేణంగివరం వరకు ఉన్న రన్‌వేపై ట్రయల్ రన్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం ఐదు విమానాలు ఇక్కడ లాండింగ్ చేసి 2022లో రెండు ట్రయల్ రన్‌లు సక్సెఫుల్‌గా చేశారు.
16వ నెంబర్ జాతీయ రహదారిపై సింగరాయకొండ, కొరిశెపాడు దగ్గర రెండు ప్రాంతాల్లో నిర్దేశిత ప్రాంతం నుంచి 3.5 నుంచి 4కిలోమీటర్ల పరిధిలో అత్యవసర ఎయిర్ ప్యాడ్లను నిర్మించారు. విమానాలు ల్యాండింగ్ కోసం 5 కిలోమీటర్ల మేర రన్‌వేను దృఢంగా, సౌకర్యవంతంగా నిర్మాణాలు చేపట్టారు. జాతీయ రహదారిపై 60 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేశారు. వీటిని నిర్మించే ప్రాంతాల్లో జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌తో పాటు రోడ్డు, విద్యుత్ స్తంభాలు, బస్ బే, చెట్లను తొలగించారు. రన్‌వేకు ఆనుకుని ప్రధాన రహదారిపై విమానాల పార్కింగ్ స్లాట్స్ నిర్మించారు. అందుకోసం రహదారిని రెండు వైపులా విస్తరించి ఇతర వాహనాలను ఆ మార్గంలో మళ్లిస్తారు.
యుద్దం వస్తే ఇక్కడే విమానాల ల్యాండింగ్..
అత్యవసర పరిస్థితులు, భూకంపాలు, వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు, హఠాత్తు పరిణామాలు, యుద్ద మేఘాలు అలముకున్న వేళ ప్రజలకు సత్వర సాయం అందించేందుకు.. వీలుగా అత్యవసర ఎయిర్ ప్యాడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం. ఆయా సందర్భాల్లో రహదారులు, రైల్వే లైన్లు దెబ్బతిన్న సమయాల్లో, యుద్ధాల వంటి ఇతర అత్యవసర పరిస్థితుల్లో, ఆపదలో ఉన్న ప్రజల తరలింపు సహాయక చర్యల కోసం వీటిని ముఖ్య రహదారులపై నిర్మించారు. దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండగా జాతీయ రహదారులపై 11 రాష్ట్ర రహదారులు మిగిలినవి రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో రన్‌వే కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేంద్రం. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ద వాతావరణం నెలకొని ఉండటంతో ఉమ్మడి ప్రకాశంజిల్లాలోని ఈ రెండు రోడ్ కం రన్‌వేలను భారత సైన్యం ఉపయోగించుకునే అవకాశాలపై ఆశక్తికరంగా చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..