Andhra Pradesh: ఆయనో జిల్లా కలెక్టర్.. ఓ వైపు బాధ్యతలు.. మరోవైపు అయ్యప్ప దీక్షతో సామాన్యుడిలా…
ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిజాయితీగల అధికారగా ఇప్పటికే ఎంతో మంది మన్నలను పొందారు. జిల్లా కలెక్టర్ గా ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఆయన ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. ఎన్నో నియమాలతో ఎంతో నిష్టగా చేయవలసిన దీక్ష. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు, టెన్షన్లు ఉంటాయి.
ఓ పక్క అధికారిగా తన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వహిస్తూ మరోపక్క ఆధ్యాత్మిక సేవలో సాధారణ వ్యక్తిలా ముందుకు వెలుతున్నారాయన. నిత్యం ప్రభుత్వ పథకాల పై సమీక్షలు, ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులు, ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, కింద స్థాయి నుంచి వచ్చే నివేదికలు, పై అధికారులకు వివరణలు .. ఇలా ఉక్కిరిబిక్కిరి చేసే పనులు మధ్య దీక్ష చేయడమంటే సాదారణ వ్యక్తల కంటే కష్టతరంగా నే ఉంటుంది. అయితే ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అయ్యప్ప దీక్షను చేపట్టడమే కాదు ఇతర స్వాముల్లా భజనలు, అన్నవితరణలోనూ పాల్గొంటున్నారు. ఇపుడు ఏలూరు జిల్లా కలెక్టర్ సామాన్యుడిలా కలిసి పోతుండటంతో స్ధానికులు, మాల దారులు సైతం సంతోషంగా ఫీలవుతున్నారు.
జిల్లా కలెక్టర్ గా తన విధులలో ఏమాత్రం అలసత్వం లేకుండా ముందుకు వెలుతూ చేపట్టిన భగవంతుని దీక్షలో సైతం అంతే బాధ్యతగా ఆయన వ్యవహరిస్తున్న తీరు పలువురికి మార్గదర్శకంగా మారింది. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిజాయితీగల అధికారగా ఇప్పటికే ఎంతో మంది మన్నలను పొందారు. జిల్లా కలెక్టర్ గా ఎంతో బాధ్యతాయుతంగా ముందుకు వెళ్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఆయన ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారు. ఎన్నో నియమాలతో ఎంతో నిష్టగా చేయవలసిన దీక్ష. ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ గా ఎన్నో బాధ్యతలు, టెన్షన్లు ఉంటాయి. బాధ్యతల మధ్య దీక్ష చేపట్టడం ఎంతో కష్టమైన విషయం.. కానీ ఆయన తన రెండు బాధ్యతలను ఎంతో శ్రద్ధతో నిర్వహిస్తూ ముందుకు వెలుతున్నారు.
అంతేకాకుండా ఆధ్యాత్మిక చింతన భక్తి అనేది మనలోని సద్గుణాలను మేల్కొలుపుతోందని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అంటున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప దీక్ష చేపట్టిన అయన ఏలూరు రూరల్ దొండపాడు శ్రీ బాల అయ్యప్ప క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి మండల దీక్ష స్వాములకు ద్వాదశి 12వ వార్షిక దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ అయ్యప్ప స్వామి మండల అధ్యక్ష స్వాములకు కలెక్టర్ స్వయంగా వడ్డించారు. ఆ స్వాములతో పాటు కలసి ఆయన భోజనం చేశారు. ఓ మండల స్థాయి అధికారికి సైతం ఏదైనా సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ముందు కూర్చోవాలన్న, మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీలవుతారు. ఇక సామాన్యులైతే ఆమడ దూరంలోనే ఉండిపోతారు. అలాంటిది ఇక్కడ డైరెక్ట్ గా ఓ జిల్లా కలెక్టర్ ఓ సాధారణ వ్యక్తిలా అయ్యప్ప స్వాముల బిక్ష కార్యక్రమంలో పాల్గొని దగ్గరుండి అందరికీ స్వయంగా బిక్ష వడ్డిస్తూ, వారితో కలిసి భోజనం చేయడంతో తోటి స్వాములు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిబద్ధత పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
భగవంతుడు ముందు అందరూ సమానమే అనే విధంగా ఓ మంచి మెసేజ్ ను కలెక్టర్ తీసుకువెళ్లారు. అదేవిధంగా ప్రతి మనిషి వారి వారి మతాలను బట్టి భగవంతుని ఆరాధించడం ఉత్తమమైన మార్గమని, మంచి సత్ప్రవర్తన ద్వారా సమాజానికి సేవ చేసే సంకల్పం కలుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దాంతో జిల్లాలో ప్రతి ఒక్కరు కలెక్టర్ ను అభినందిస్తున్నారు. ఓ పక్క కలెక్టర్ గా బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వహిస్తూ, ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ.. మరోపక్క తాను చేపట్టిన దేవుని దీక్షలో సైతం పాల్గొంటూ నిరంతరం ప్రజా సేవలోను, ఆధ్యాత్మిక సేవలను గడుపుతూ ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను పలువురు కొనియాడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..