Talupulamma: భక్తుల తలపులను తీర్చే తలుపులమ్మ ఆలయానికి మహర్ధశ.. మరో ఆరు నెలల్లో పూర్తి కానున్న పనులు

కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి మహర్ధశ రాబోతోంది. ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌తో ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు. కొండల మధ్య వెలసిన అమ్మవారి విగ్రహాలు కదపకుండా నూతన ఆలయం నిర్మిస్తున్నారు. పూర్తిగా కృష్ణ శిలతో ఆలయం నిర్మాణం జరుగుతోంది. అతి పురాతనమైన అమ్మవారి ఆలయం కావడంతో భక్తుల దర్శనాల కోసం ఆలయం పునఃనిర్మాణం చేపట్టారు. సుమారు 15 కోట్లతో దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం […]

Talupulamma: భక్తుల తలపులను తీర్చే తలుపులమ్మ ఆలయానికి మహర్ధశ.. మరో ఆరు నెలల్లో పూర్తి కానున్న పనులు
Talupulamma Lova Temple
Follow us
Surya Kala

|

Updated on: Nov 03, 2023 | 8:16 AM

కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వెలసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి మహర్ధశ రాబోతోంది. ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌తో ఆలయ పునఃనిర్మాణం చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు. కొండల మధ్య వెలసిన అమ్మవారి విగ్రహాలు కదపకుండా నూతన ఆలయం నిర్మిస్తున్నారు. పూర్తిగా కృష్ణ శిలతో ఆలయం నిర్మాణం జరుగుతోంది. అతి పురాతనమైన అమ్మవారి ఆలయం కావడంతో భక్తుల దర్శనాల కోసం ఆలయం పునఃనిర్మాణం చేపట్టారు. సుమారు 15 కోట్లతో దేవస్థానం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా.. నూతన ఆలయం, గాలిగోపురం, మెట్ల విస్తరణతోపాటు కాటేజీలను నిర్మిస్తున్నారు. ఆరు నెలల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కానుండగా.. జనవరికి నూతన ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు ఆలయ ఈవో విశ్వనాధరాజు. పునఃనిర్మాణ పనులు పూర్తి అయితే.. తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఏపీలోనే ప్రముఖ దివ్య క్షేత్రంగా వెలుగొందడం ఖాయమని చెప్పారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ అమ్మవారి ఆలయం తలుపులమ్మ దేవాలయం. ప్రసిద్ధి పర్యాటక కేంద్రంలో వృక్ష సంపద స్పెషల్ అట్రాక్షన్. దట్టమైన అడవులు, కొండలు పచ్చని ప్రకృతి మధ్య అమ్మవారి క్షేత్రం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ కొండల్లో ఒకటి ‘ధారకొండ’ .. మరొకటి ‘తీగకొండ’  అని స్థానికులు పిలుస్తారు. ఈ రెండు కొండల మధ్య నుంచి  తలుపులమ్మ అమ్మవారు దర్శనమిస్తారు. తలపులను నెరవేస్తుంది కనుక ఇక్కడ అమ్మవారిని తలుపులమ్మగా భక్తులు పిలుస్తారని పురాణాల కథనం,

పురాణాల ప్రకారం..

కృతయుగంలో ఇక్కడకు చేరుకున్న అగస్త్య మహర్షికి సంధ్యావందనం చేసుకోవాలనుకుంటే అప్పుడు ఎక్కడా నీరు కనిపించేలేదట. దీంతో అప్పుడు ఆ మహర్షి జగన్మాతని ప్రార్ధించగా.. అప్పుడు కొండపై నుంచి జలపాతాలుగా నీటి ధారలుగా కురిశాయట. అప్పుడు అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత జగన్మాతను ఇక్కడే కొలువై ఉండమని కోరడంతో అమ్మవారు ఆ కొండల్లో వెలిశారట. కాలక్రమంలో తలుపులమ్మగా భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ పూజలను అందుకుంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..