Ayodhya Temple: బంగారు సింహాసనంపై కొలువుదీరనున్న బాల రామయ్య.. రాజస్థాన్‌లో తుది మెరుగులు
ఈ సింహాసనాన్ని రాజస్థాన్‌లోని కళాకారులు తయారు చేస్తున్నారని.. డిసెంబర్ 15 నాటికి అయోధ్యకు చేరుకుంటుందని తెలిపారు. ఈ సింహాసనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు , ఎనిమిది అడుగుల పొడవుతో ఉండనుంది. ఇప్పటికే గర్భగుడి నిర్మాణం పూర్తయిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మ భూమి ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య. సరయు తీరంలోని రామ ముందర నిర్మాణం శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే గర్భలో బాల రాముడు కొలువుదీరే ముహార్తాన్ని నిర్ణయించారు. అయోధ్యాపురిని అందంగా అలంకరించడానికి ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో హాజరవ్వమని ప్రధాని మోడీ, స్వాములు, సన్యాసుల తో సహా వేలాది మంది ప్రముఖులకు ఆహ్వానం అందుకున్నారు. అంతేకాదు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి తరచుగా రామ మందిర నిర్మాణానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తునే ఉన్నారు. తాజాగా అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో బాల రామయ్య .. ఎనిమిది అడుగుల ఎత్తైన బంగారు పూతతో కూడిన పాలరాతి సింహాసనంపై కొలువుదీరనున్నారని వెల్లడించారు.
ఈ సింహాసనాన్ని రాజస్థాన్‌లోని కళాకారులు తయారు చేస్తున్నారని.. డిసెంబర్ 15 నాటికి అయోధ్యకు చేరుకుంటుందని తెలిపారు. ఈ సింహాసనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు , ఎనిమిది అడుగుల పొడవుతో ఉండనుంది. ఇప్పటికే గర్భగుడి నిర్మాణం పూర్తయిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.
ఆలయంలోని మొదటి అంతస్తు పనులు 80 శాతం పూర్తయ్యాయని.. అయితే డిసెంబర్ 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌ను సిద్ధం చేయనున్నామని చెప్పారు. మొదటి అంతస్తులో 17 స్తంభాలు ఏర్పాటు చేయగా.. మరో రెండు పనులు మాత్రమే మిగిలిఉన్నాయని పేర్కొన్నారు. పరిక్రమ మార్గ్‌లోని ఫ్లోరింగ్ పూర్తయిందని .. ప్రస్తుతం గృహ మండపం నేలపై మార్బుల్‌ను అమర్చే పని జరుగుతోందని మిశ్రా చెప్పారు. మొదటి అంతస్తు పైకప్పు డిసెంబర్ 15 నాటికి పూర్తవుతుంది.
రామమందిర వెలుపలి గోడ (‘పార్కోట’) ప్రవేశ ద్వారం పనులు చివరి దశకు వచ్చాయని.. నవంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం మూడు అంతస్తుల పైకప్పులు నిర్మించబడ్డాయని వెల్లడించారు. రామ్ లల్లా ఆలయ నిర్మాణం కోసం భారీ సంఖ్యలో భక్తులు పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులను విరాళంగా ఇచ్చారని.. వాటిని నిల్వ చేయడం కష్టం కనుక వాటిని కరిగించి ఇతర పనులకు ఉపయోగించే విధంగా ప్రణాళిక వేస్తున్నామని మిశ్రా పేర్కొన్నారు. ప్రఖ్యాత సంస్థ పర్యవేక్షణలో ఈ బంగారం, వెండి కరిగించే పని జరుగుతుందని ఆయన తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.