Andhra Pradesh: ఎట్టకేలకు శెట్టిపల్లి భూముల సమస్య పరిష్కారం.. 2 వేల కుటుంబాలకు MLA భూమన పత్రాల పంపిణీ
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగిన శెట్టిపల్లి భూములపై పోరాటం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. ప్రతి గ్రామంలోని వ్యవసాయ భూములు, ఇళ్ళ స్థలాలను సర్వే చేసి అనుభవదారులకు ప్రభుత్వం సెటిల్‌మెంట్ హక్కు కల్పించినా శెట్టి పల్లి మాత్రం జరగలేదు. శెట్టిపల్లి ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ చట్టం అమలు కాలేదు. తమ భూములపై చట్ట బద్ధ హక్కుల కోసం 75 ఏళ్లుగా చేస్తున్న ఆ గ్రామ ప్రజల పోరాటానికి ఎట్టకేలకు ప్రభుత్వం పరిష్కారం..
శెట్టిపల్లి, నవంబర్ 3: స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కొనసాగిన శెట్టిపల్లి భూములపై పోరాటం ఎట్టకేలకు పరిష్కారం అయ్యింది. ప్రతి గ్రామంలోని వ్యవసాయ భూములు, ఇళ్ళ స్థలాలను సర్వే చేసి అనుభవదారులకు ప్రభుత్వం సెటిల్‌మెంట్ హక్కు కల్పించినా శెట్టి పల్లి మాత్రం జరగలేదు. శెట్టిపల్లి ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ చట్టం అమలు కాలేదు. తమ భూములపై చట్ట బద్ధ హక్కుల కోసం 75 ఏళ్లుగా చేస్తున్న ఆ గ్రామ ప్రజల పోరాటానికి ఎట్టకేలకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. సుమారు 2 వేల కుటుంబాలకు చెందిన 636.38 ఎకరాల భూములపై అధికారిక హక్కులు కల్పిస్తూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పత్రాలు పంపిణీ చేశారు.
తిరుపతికి 4 కిలో మీటర్లలోపు దూరంలో ఉన్న శెట్టిపల్లి గ్రామంలో 636.38 ఎకరాల వ్యవసాయ, నివాస భూములు ఉండగా అనుభవంలో ఉన్న ఆ భూములపై హక్కులు మాత్రం అక్కడి వారికి లేకుండా పోయాయి. హక్కుల కోసం నేటి తరం వారి పోరాటం తాతలు, తండ్రులు నుంచి వారసత్వంగా వచ్చింది. పరిష్కారం కోసం ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చిన శెట్టిపల్లి కుటుంబాలు సమస్య పరిష్కారం కోసం చేయని ప్రయత్నం లేకపోయింది. సీపీఎం పార్టీ 16 ఏళ్లుగా ఈ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తూనే వచ్చింది.
75 ఏళ్లుగా నలుగుతున్న శెట్టిపల్లి సమస్యకు పరిష్కారం కోసం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి క్షేత్ర స్థాయిలో ఉన్న చిక్కుముడులను పరిష్కారం లభించేలా చేశారు. గ్రామస్తులందరినీ ఏకం చేసి చర్చలు జరపడంతో డిప్యూటీ మేయర్ అభినయ్ సక్సెస్ కాగా శెట్టిపల్లి సమస్యకు రెవెన్యూ యంత్రాంగం సహకరించింది. శెట్టిపల్లిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయించి సమస్య పరిష్కారం చేయగలిగారు. దాదాపు ఏడాది పాటు అధికార్లు చేసిన ప్రయత్నం అపరిష్కృత సమస్యకు పరిష్కారం సాధించేందుకు కారణం అయ్యింది. ఈ మేరకు శెట్టిపల్లిలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి శెట్టిపల్లి వాసుల కలను నిజం చేసింది. భూములు, ఇంటి స్థలాల పై హక్కులు కల్పిస్తూ అధికారిక పత్రాలు ఇప్పించింది. ఈ సమస్య పరిష్కారంలో సిపిఎం నేతలు చొరవ చూపడంతో ఎట్టకేలకు శెట్టిపల్లి సమస్య తీరింది.
ఐటీ హబ్‌గా శెట్టిపల్లి
శెట్టిపల్లిని ఐటి హబ్ గా తయారు చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రూ.3 కోట్లతో గ్రామాభివృద్ధికి పనులు ప్రారంభించనున్న కార్పోరేషన్ శెట్టిపల్లికి తెలుగుగంగ నీటిని సరఫరా చేయనుంది. ఆర్టీవో కార్యాలయం ఎదురుగా మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణ పనులతో అబ్దివృద్ది చేయనుంది. సుదీర్ఘ సమస్య పరిష్కారంతో వ్యవసాయ, ఇంటి స్థలాల అనుభవదారులకు ప్రభుత్వ యంత్రాంగం అప్పజెప్పింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.