AP Postal Ballots: ఏపీలో పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..

|

May 30, 2024 | 4:22 PM

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంపై ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉంటే.. ఓటు చెల్లుబాటు అవుతుందన్న రూల్‌ని వైసీపీ తప్పుబడుతోంది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను కోరింది.

AP Postal Ballots: ఏపీలో పోస్టల్ బ్యాలెట్లపై ఈసీ కీలక నిర్ణయం.. పూర్తి వివరాలివే..
Ap Politics
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అంశంపై ఈసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారుతోంది. పోస్టల్ బ్యాలెట్‌పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉంటే.. ఓటు చెల్లుబాటు అవుతుందన్న రూల్‌ని వైసీపీ తప్పుబడుతోంది. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ను కోరింది. దేశం మొత్తం ఒక నిబంధన ఉంటే ఏపీలో ప్రత్యేక రూల్ ఎందుకు తెచ్చారంటూ ప్రశ్నిస్తోంది.. ఈసీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ పేర్కొంటోంది.. కాగా.. ఓటమి భయంతోనే వైసీపీ అనవసర ఆరోపణలు చేస్తుందంటూ టీడీపీ ఆరోపిస్తోంది. రాజకీయంగా పోస్టల్ బ్యాలెట్ అంశం మరింత ముదరడంతో.. రాష్ట్ర ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. గురువారం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది.

వైసీపీ అభ్యంతరాలపై సీఈవో మీనా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరారు. ఈ మేరకు సీఈఓ.. ఈసీఐకి లేఖ పంపగా.. దీనిపై పూర్తి వివరాలను వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి, సీల్ ,హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. అలాంటి పోస్టల్ బ్యాలెట్లను వాలీడ్ చేయాలని ఆదేశాలిచ్చింది..

పోస్టల్ బ్యాలెట్ విషయంపై న్యాయస్థానంలో విచారణ సైతం ప్రారంభం అయింది. 13ఏ, 13బీకి సంబంధించిన అన్ని నిబంధనలను ముందుగానే ప్రకటించారని  పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ లో స్క్రూటినీ చాలా ముఖ్యమని.. ఈసీఐ నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకం లేకపోతే దాన్ని రద్దు చెయ్యాలని చెప్పారు. అర్ఓసీలు సంతకంతోనే ఓట్ వాలిడ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఈసీ ముందుగానే చెప్పిందని.. పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..