కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇవాళ (శనివారం) విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. జగన్నాథ గుట్టలోని టిడ్కో ఇళ్లను సందర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లినప్పుడు విద్యార్థులు, లాయర్లు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో నిరసన చేస్తున్న తమపై చంద్రబాబు తీవ్ర దుర్భాషలాడారని, టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు బంద్ కు ప్రకటించారు. ఏపీలో చంద్రబాబునాయుడు బాదుడే బాదుడు అంటూ జనంలోకి వెళుతున్న సమయంలో ఆయనకు నిరసనలు ఎదురవుతున్నాయి. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయనకు నిరసన సెగ తగులుతోంది. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల రూపంలో న్యాయ రాజధాని కేక, కేపిటల్ పొలికేకగా మారింది. చంద్రబాబు మూడు రోజుల కర్నూలు పర్యటన నిరసనల మధ్యే సాగింది. కర్నూలులో న్యాయ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ బాబుకు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. నిరసనకారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తే, టీడీపీ తీరుకు నిరసనగా ఇవాళ కర్నూలు జిల్లాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.
కర్నూలులో హైకోర్టుకు అనుకూలంగా ప్రకటన చేయాలంటూ టీడీపీ అధినేత పర్యటించిన ప్రతి చోటా నిరసన వ్యక్తమైంది. నిరసనకారులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నుంచి వరుసగా మూడు రోజులుగా బాదుడే బాదుడే కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించారు. పత్తికొండ, ఎమ్మిగనూరు, కర్నూలుల్లో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. లాయర్లు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థులకు, లాయర్ల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ ఆఫీస్ దగ్గర చంద్రబాబు సభ జరుగుతున్నంత సేపు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.
టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కొందరు విసరడం సంచలనంగా మారింది. నిరసన వ్యక్తం చేస్తున్న వారిని ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాట తీస్తానని, తాను రౌడీలకే రౌడీని అంటూ వార్నింగ్ ఇచ్చారు. పత్తికొండలో చంద్రబాబు రాజకీయ ఎమోషన్ రాజేశారు. కౌరవసభగా మారిన ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశా…మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకు ఇవే చివరి ఎన్నికలు అని బాబు చెప్పడం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెంచుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..