డబ్బులు మారినట్టు తెలిస్తే కఠిన చర్యలు.. ఏకగ్రీవాలు ఫ్రీ అండ్‌ ఫేర్‌గా జరగాలన్న కలెక్టర్‌

|

Jan 29, 2021 | 2:07 PM

తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పెద్దాపురం, కాకినాడ డివిజన్‌లో మొదటి విడత..

డబ్బులు మారినట్టు తెలిస్తే కఠిన చర్యలు.. ఏకగ్రీవాలు ఫ్రీ అండ్‌ ఫేర్‌గా జరగాలన్న కలెక్టర్‌
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలి విడత ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. వివిధ పార్టీల అభ్యర్థన మేరకు గ్రామ వాలంటీర్లు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం స్ట్రిక్ట్‌గా ఆదేశాలు జారీ చేసింది.

మరో వైపు అధికార పార్టీ ఏకక్రీవాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవాలు జరిగితే గ్రామాలకే మంచిదని, అభివృద్ధి నిధులు అధికంగా వస్తాయని చెబుతున్నారు. వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవంగా కైవసం చేసుకోవాలని వైసీపీ ప్లాన్‌ చేస్తుంది.

ఇక తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. పెద్దాపురం, కాకినాడ డివిజన్‌లో మొదటి విడత నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు ఫ్రీ అండ్‌ ఫేర్‌గా జరిగితే పర్వాలేదన్నారు జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి. డబ్బులు మారినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ వాలంటీర్లు ఎవ్వరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చెప్పారు.

 

కాకినాడ నామినేషన్లలో వాలంటీర్ల సందడి.. ఎన్నికల సంఘం నిబంధనలు పట్టించుకోని అధికారులు

పల్లెల్లో మోగిన నగారా.. నేటి నుంచే తొలి ఘట్టం షురూ.. మొదటి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు