కాకినాడ నామినేషన్లలో వాలంటీర్ల సందడి.. ఎన్నికల సంఘం నిబంధనలు పట్టించుకోని అధికారులు
ఏపీలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ రోజు తొలివిడత నామినేషన్లను అధికారులు..

ఏపీలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ రోజు తొలివిడత నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు. విజయనగరంజిల్లా మినహా మిగతా 12 జిల్లాలో తొలి విడత నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు.
ఈ నెల 31 వరకూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశలో మొత్తం 3,249 గ్రామ పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి.
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇవాళ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియలో కాకినాడలోని కొన్ని చోట్ల గ్రామ వాలంటీర్లు కనిపించారు. ఎస్‌ఈసీ నిబంధనలు ఉన్నా…పలు గ్రామ పంచాయతీ పరిసరాల్లో వాలంటీర్లు ప్రత్యక్ష మయ్యారు. ఈ విషయం స్థానిక ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లినా…పట్టించుకోలేదని సమాచారం.