ఏపీ గవర్నర్ హరిచందన్‌కు నిమ్మగడ్డ లేఖ.. సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలంటూ వినతి..
AP Local Body Elections: ఏపీలో పంచాయితీ ఎన్నికల హీట్ మొదలైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ వరుస లేఖలు సంచలనంగా మారుతున్నాయి...

AP Local Body Elections: ఏపీలో పంచాయితీ ఎన్నికల హీట్ మొదలైంది. ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రసాద్ వరుస లేఖలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. అలాగే మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గతంలో కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేయాలని కోరారు. మొన్నటి మొన్న ద్వివేది, గిరిజా శంకర్‌లపై అభిశంసనకు ప్రతిపాదించారు. ఇవాళ ప్రవీణ్ ప్రకాష్‌ను పక్కన పెట్టాలని సీఎస్‌ను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి…
హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!
ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..