AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. భక్తిశ్రద్ధలతో శ్రీ కుంకుళ్లమ్మ దీక్షల వైభవం!

శరన్నవరాత్రి పర్వదినాల వేళ పశ్చిమ గోదావరి, ఏలూరు ప్రాంతాల్లోని ప్రముఖ దివ్యక్షేత్రం ద్వారకాతిరుమల ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ద్వారకాతిరుమల శ్రీ చినవెంకటేశ్వర స్వామివారి సన్నిధికి కూతవేటు దూరంలో కొలువైన క్షేత్రదేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక పరిమళాలతో మార్మోగుతోంది.

నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. భక్తిశ్రద్ధలతో శ్రీ కుంకుళ్లమ్మ దీక్షల వైభవం!
Sri Kunkullamma Temple
B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 11, 2026 | 7:27 PM

Share

ఏలూరు : దసరా శరన్నవరాత్రుల వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ దివ్యక్షేత్రం ద్వారకాతిరుమల ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. శ్రీవారి సన్నిధికి కూతవేటు దూరంలో కొలువైన క్షేత్రదేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయం భక్తుల జయజయధ్వానాలతో మార్మోగుతోంది. భక్తుల కొంగుబంగారంగా, ఆపదలను కాపాడే ఆపద్బాంధవిగా వెలుగొందుతున్న కుంకుళ్లమ్మను శ్రీ చినవెంకన్న సోదరిగా భక్తులు అత్యంత భక్తిప్రపత్తులతో కొలుస్తారు.

శరన్నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని అమ్మవారి అనుగ్రహం కోసం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనసందోహంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఈ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో కుంకుళ్లమ్మ దీక్షాపరుల ‘నీలాంబరధారణ’ ప్రత్యేక శోభను సంతరించుకుంది. నీలం రంగు వస్త్రాలు ధరించి, కఠిన నియమాలను పాటిస్తూ ఆలయానికి చేరుకుంటున్న భక్తులు అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.

కొందరు భక్తులు భవానీ దీక్షలతో పాటు కుంకుళ్లమ్మ దీక్షలను కూడా అంతే నిష్ఠతో ఆచరిస్తుండటం విశేషం. భక్తులు తమ సంకల్పాన్ని బట్టి 41, 21, 11 రోజుల పాటు ఈ దీక్షలను స్వీకరిస్తున్నారు. ఎక్కువ రోజులు నియమాలను పాటించడం శారీరకంగా కష్టమయ్యే వృద్ధులు, మహిళలు, చిన్నారుల కోసం మూడు రోజుల స్వల్పకాల దీక్షలను కూడా ఆచరించే వెసులుబాటు ఉండటంతో వారు సైతం ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల పుణ్యదినాల్లో పలువురు భక్తులు 11 రోజుల దీక్షా వస్త్రాలను ధరించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఆలయ ప్రాంగణంలో ఉన్న పురాతన కుంకుడు వృక్షం

ఇక్కడి ఆరాధనా సంప్రదాయంలో పురాతన కుంకుడు వృక్షం విశిష్ట స్థానాన్ని దక్కించుకుంది. ఆలయం వెనుక భాగంలో విలసిల్లుతున్న ఈ వృక్షాన్నే భక్తులు అమ్మవారి సాక్షాత్ ఆవిర్భావ మూలస్థానంగా విశ్వసిస్తారు. క్షేత్రానికి చేరుకున్న దీక్షాపరులు తొలుత ఈ కుంకుడు వృక్షాన్ని దర్శించి, ప్రదక్షిణలు ఆచరించి, దీపారాధన చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారం. ఆ తదనంతరమే ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుంటూ మూలవిరాట్ దర్శనానికి తరలివెళ్తున్నారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయానికి కేవలం ఒక కిలోమీటరు దూరంలోనే ఈ క్షేత్రం ఉండటంతో, స్వామివారిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో క్షేత్రదేవత కుంకుళ్లమ్మను దర్శించుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి సోదరిగా ప్రసిద్ధి చెందిన కుంకుళ్లమ్మను దర్శించుకుంటేనే తమ తీర్థయాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
నీలాంబర శోభతో పులకించిన ద్వారకాతిరుమల.. శ్రీ కుంకుళ్లమ్మ దీక్షలతో
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
స్టార్ హీరో సినిమాలో రోల్ అని చెప్పి మోసం చేశారు..
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!