Andhra Pradesh: ఆశ్చర్యం.. ఏపీలో పెరిగిన మునక్కాడల ధర… కేజీ ఏకంగా రూ.600

|

Dec 11, 2021 | 6:29 PM

ఏపీలో కూరగాయల ధరలు సామాన్యులకు షాక్ కొట్టిస్తున్నాయి. అలాగని రైతులు లాభపడుతున్నారా అంటే అది కూడా లేదు.

Andhra Pradesh: ఆశ్చర్యం.. ఏపీలో పెరిగిన మునక్కాడల ధర... కేజీ ఏకంగా రూ.600
Drumstick Price In Ap
Follow us on

ఏపీలో కూరగాయల ధరలు సామాన్యులకు షాక్ కొట్టిస్తున్నాయి. అలాగని రైతులు లాభపడుతున్నారా అంటే అది కూడా లేదు. ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.. మరుసటి రోజుకే తగ్గిపోతున్నాయి. ఇటీవల టమాట ధర సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. దీంతో రైతులు సంబరపడుతున్న వేళ.. రెండు రోజులకే కేజీ రూ.30 కి పడిపోయింది.  తాజాగా మునక్కాడల ధరలు ఉన్నపళంగా ఆకాశానికి ఎగబాకాయి. ప్రస్తుతం ధర ఎంతో చెబితే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. . చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కిలో మునక్కాయల ధర 600 రూపాయలకు చేరింది. కేజీకి 13 నుంచి 17 మునక్కాయలు తూగుతాయి. ఒకవేళ కేజీకి 15 తూగుతాయి అనుకుందాం. దీని ప్రకారం ఒక్కో మునక్కాయ ధర దాదాపు రూ. 40 రూపాయలు పలికినట్లు లెక్క.

వర్షాలు, వరదలే కారణం…

ఏపీలో ఇటీవల టమాట ధరలు ఠారెత్తించినా.. తాజాగా మునక్కాయల ధరలు మంట పుట్టిస్తున్నా అందుకు భారీ వర్షాలు, వరదలే కారణం. ఇటీవలే సీమపై వరుణుడు దండెత్తిన విషయం తెలిసిందే. దీంతో ఈదురుగాలులకు చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో మునగతోటలు ధ్వంసమయ్యాయి. దీంతో తమిళనాడు నుంచి మునక్కాయలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. మునక్కాడలు మాత్రమే కాదండోయ్. బీరకార, కాకర, వంకాయ, బీన్స్ ఇలా ఏది ముట్టుకున్నా షాక్ కొడుతోంది. దీంతో సామాన్య ప్రజలు మార్కెట్ వైపు చూడాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డిజిల్, వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా ఇలా మండిపోతుంటే ఎట్టా బ్రతకాలని సగటు మనిషి ప్రశ్నిస్తున్నాడు. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: Ram Charan-Jr NTR: ఎన్టీఆర్‌ను నడుముపై గిల్లిన చరణ్.. తారక్ రియాక్షన్ చూడండి

నదిపై తేలియాడుతూ వచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్