AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైసీపీ నిరసనలు.. అనంతపురంలో టెన్షన్.. టెన్షన్..!

అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని హత్య, మైనర్ బాలికపై అత్యాచారం సంఘటనలు రాష్ట్రాన్ని కుదిపేశాయి. నిర్లక్ష్యంపై సీఐని సస్పెండ్ చేశారు. 13 మందిని అరెస్ట్ చేశారు. ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. వైసీపీ నాయకుల నిరసనలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైసీపీ నిరసనలు.. అనంతపురంలో టెన్షన్.. టెన్షన్..!
Ap Womens Commission Chairp
SN Pasha
|

Updated on: Jun 12, 2025 | 10:35 PM

Share

అత్యాచార ఘటనలపై అనంతపురంలో వైసీపీ నేతల నిరసనలకు దిగారు. అయితే వారిని పోలీసుల అడ్డగించడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలపై ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ సైతం అనంతపురంలో పర్యటించారు.

అనంతపురం శివారు కూడేరులో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసు.. రామగిరిలో మైనర్ బాలికపై రెండు సంవత్సరాల పాటు 14 మంది అత్యాచారం కేసు.. రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిర్లక్ష్యం వ్యవహరించిన అనంతపురం సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మైనర్ బాలిక కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగిన ఈ రెండు సంఘటనలను ఏపీ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించింది. స్వయంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ అనంతపురంలో పర్యటించి.. అత్యాచారానికి గురైన మైనర్ బాలికను పరామర్శించారు.

అదేవిధంగా హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని తన్మయి తల్లదండ్రులను కూడా పరామర్శించారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ అనంతపురంలో పర్యటిస్తుండగానే.. వైసీపీ నాయకులు చలో పేరూరుకు పిలుపునిచ్చారు. మైనర్ బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్.. మాజీ మంత్రి మేరుగ నాగర్జున.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు ప్రకాష్‌ రెడ్డి. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై కూర్చుని మాజీ మంత్రి ఉషశ్రీ నిరసన తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..