Stray Dogs: రెచ్చిపోయిన పిచ్చి కుక్కలు.. 11 మంది ఉపాధి కూలీలపై దాడి

తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో శునకాల దాడులతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎక్కడినుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుంటున్నారు.

Stray Dogs: రెచ్చిపోయిన పిచ్చి కుక్కలు.. 11 మంది ఉపాధి కూలీలపై దాడి
Stray Dogs
Follow us
Aravind B

| Edited By: Ravi Kiran

Updated on: Apr 25, 2023 | 3:50 PM

తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో శునకాల దాడులతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎక్కడినుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే వరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుంటున్నారు. దాదాపు 2 నెలలుగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ కుక్కల దాడుల్లో కొంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కూడా కలకలం రేపుతోంది.

అయితే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి పల్లిపాలెం గ్రామంలో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలపై దాడికి ఎగబడ్డాయి. దాదాపు 11 మంది ఈ పిచ్చి కుక్కల దాడిలో గాయాలపాలయ్యారు. ఇందులో పలువురు మహిళలు కూడా ఉన్నారు. అలాగే కొద్ది రోజులుగా కొత్తపేటలో కూడా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కొంతమందిపై దాడులు కూడా చేశాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి