AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Freedom Fighters Village: ఆ గ్రామం స్వాతంత్ర పోరాటయోధుల నిలయం.. నేటికీ అభివృద్ధికి ఆమడ దూరం.. పాలకులు పట్టించుకోవాలని విన్నపం

దేశమంతా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తి తొణికిసలాడుతోంది. ఓ చిత్రకారుడు మహాత్ముడి జీవిత ఘట్టాలను కళ్లకు కట్టారు. ఓ మాస్టారు చాక్‌పీస్‌పై మువ్వన్నెల జెండాను చెక్కారు.  

AP Freedom Fighters Village: ఆ గ్రామం స్వాతంత్ర పోరాటయోధుల నిలయం.. నేటికీ అభివృద్ధికి ఆమడ దూరం.. పాలకులు పట్టించుకోవాలని విన్నపం
Freedom Fighters Village
Surya Kala
|

Updated on: Aug 15, 2022 | 6:29 PM

Share

AP Freedom Fighters Village: ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి మేము సైతం అంటూ కదిలిందా గ్రామం. గాంధీజీ పిలుపునందుకుని ఉద్యమించింది. ఆ గ్రామస్తుల స్ఫూర్తిని చూసి దేవరంపాడును పర్యాటక కేంద్రంగా మార్చుతామని హామీ ఇచ్చారు ఆనాటి పాలకులు. 75 ఏళ్లు అవుతున్నా నేటికీ ఆ కల నెరవేరలేదు. కనీసం 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉద్యమ సందర్భంగా అయినా తమ ఊరును అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.  మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ దేశవ్యాప్తంగా సాగుతన్న ఆజాదీ క అమృత్‌ మహోత్సవాల సంబురాలు ఓవైపు. ఈ ఉత్సవాలకు గుర్తుగా నిలిచిన ఎందరో మహానుభావుల త్యాగాలు మరోవైపు. ప్రకాశం జిల్లాకు చెందిన చాలా మంది స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. మహాత్మాగాంధీ పిలుపునందుకుని.. సైమన్‌ గో బ్యాక్‌ అన్న నినాదంతో బ్రిటీష్‌ పోలీసుల తుపాకులకు ఎదురెళ్లారు.

ఎందరో త్యాగధనుల చిరస్మరణీయమైన జ్ఞాపకాలున్నప్పటికీ అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వారు ప్రకాశంపంతులు. ఆయన స్వగ్రామం అయిన దేవరంపాడులో ఉప్పుసత్యాగ్రహం నిర్వహించారు. దండి తర్వాత దక్షిణ భారతదేశంలో దేవరంపాడులోనే ఉప్పుసత్యాగ్రహం సాగింది. అలాంటి చార్మిత్మాకమైన ప్రాంతమైన దేవరంపాడు, వినోదరాయునిపాలెం గ్రామాలను అభివృద్ధి చేసి, పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ఆనాటి పాలకులు అభయం ఇచ్చారు.

తెల్లోడి తుపాకీకి ఎదురు తిరిగిన ధీశాలి టంగుటూరి ప్రకాశం పతులు. ఆయన పెరెత్తగానే తెలుగోడి హృదయం ఉప్పొంగుతుంది. ఆయన గొప్పతనానికి ఆంధ్ర కేసరి అన్న బిరుదును ఇచ్చారు ప్రజలు. ఆయన సేవలకు గుర్తుగా ఒంగోలు జిల్లాను ప్రకాశం జిల్లాగా నామకరణం చేశారు.

ఇవి కూడా చదవండి

స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా ప్రతీ సారీ గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం తప్ప ఇప్పటి వరకు ఊరికి పెద్దగా చేసిందేమీ లేదు. ప్రకాశం పంతులుకు ఇక్కడి రాజుల కుటుంబానికి చెందిన వారు అప్పట్లో మామిడి తోటలు రాసిచ్చారు. ఆయన చివరి మజిలీ ఎక్కువగా తనకిష్టమైన విజయస్థూపం దగ్గరే సాగింది. ప్రకాశం పంతులు స్మృతి చిహ్నం ఏర్పాటుచేసి పర్యాటకంగా అభివృద్ది చేయాలన్న గ్రామస్తుల ఆకాంక్ష.. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ నెరవేరలేదు.

ప్రకాశం పంతులు 1872 వినోదరాయునిపాలెంలో జన్మించారు. న్యాయవాద వృత్తిలో నాటి సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించారు. అప్పుడాయనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఆయనా వాటిని లెక్కచేయలేదు. టంగుటూరి జీవితం తెరిచిన పుస్తకం. ఆయన విద్యాభ్యాసం, రాజకీయం స్వాంతత్ర్య పోరాటం అన్నీ నేటికీ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. అవన్నీ ఆయన వ్యక్తిత్వానికి, ఆత్మస్థైర్యానికి ప ్రతీకలు. ఇప్పటికీ ఆయన వారసులు ఒంగోలులో ఉంటున్నారు. వారి తాత చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూనే ఉంటారు.

స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాదు.. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన ఊరును సందర్శించిన అధికారులు కూడా గ్రామాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేలా చూస్తామని హామీ ఇస్తున్నారు.

ఇప్పటికైనా టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవను గుర్తించి.. ఆయన పుట్టి పెరిగిన గ్రామాలను మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. పంతులు లాంటి మహానుభావుల గురించి భవిష్యత్‌ తరాలకు తెలిసేలా చేసినప్పుడే వారి త్యాగాలను అర్ధం ఉంటుందన్న సంగతిని పాలకులు గుర్తుంచుకోవాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..