AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ కుప్పకూలిన డిగ్రీ విద్యార్థి.. ఇంతలోనే అంతా షాక్!

ఇటీవల గుండెపోటు మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి. శారీరకంగా ఫిట్‌గా కనిపించే యువకులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు సైతం ఒక్కసారిగా హార్ట్‌ అటాక్‌తో కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అలాంటి దారుణమే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. అప్పటివరకు కళాశాలలో ఉత్సాహంగా గడిపి, ఇంటికి తిరిగి వస్తున్న ఓ డిగ్రీ విద్యార్థి రెప్పాపాటులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.

Andhra Pradesh: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ కుప్పకూలిన డిగ్రీ విద్యార్థి.. ఇంతలోనే అంతా షాక్!
Heartattak
Balaraju Goud
|

Updated on: Sep 16, 2025 | 8:03 AM

Share

ఇటీవల గుండెపోటు మరణాలు భయంకరంగా పెరుగుతున్నాయి. శారీరకంగా ఫిట్‌గా కనిపించే యువకులు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు సైతం ఒక్కసారిగా హార్ట్‌ అటాక్‌తో కుప్పకూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అలాంటి దారుణమే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటుచేసుకుంది. అప్పటివరకు కళాశాలలో ఉత్సాహంగా గడిపి, ఇంటికి తిరిగి వస్తున్న ఓ డిగ్రీ విద్యార్థి రెప్పాపాటులో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. స్నేహితులతో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై కుప్పకూలి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మాగం నాగమణి (18) నందిగామలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. రోజూలాగే సోమవారం (సెప్టెంబర్ 15) కాలేజీకి వచ్చింది. క్లాసులు పూర్తి కాగానే, సాయంత్రం 4.30 గంట‌ల స‌మ‌యంలో తన స్నేహితులతో కలిసి ఇంటికి నడుచుకుంటూ బయల్దేరింది. తోటి విద్యార్థులతో మాట్లాడుతూనే అకస్మాత్తుగా రోడ్డుపై కింద పడిపోయింది. హఠాత్తు పరిణామంతో ఆందోళనకు గురైన స్నేహితులు ఆమె పైకి లేపేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో, స్థానికులతో కలిసి నాగమణిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు ధృవీకరించారు.ఈ వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు.

నాగమణికి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఆమె ఎంతో ఆరోగ్యంగా ఉండేదని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఉదయం కాలేజీకి రాగానే, తనకు గ్యాస్ సమస్యగా ఉందని, ఓ మాత్ర వేసుకుందని తోటి విద్యార్థులు తెలిపారు. సాయంత్రం వరకు అందరితో ఎంతో చలాకీగా మాట్లాడిందని వెల్లడించారు. అంతలోనే ఇలా జరగడంతో తోటి విద్యార్థులు, అధ్యాపకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత భవిష్యత్తు ఉన్న యువతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..