AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ.. అసలు విషయం ఇదే..!
Arogyasri
Balaraju Goud
|

Updated on: Sep 16, 2025 | 8:33 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయకపోవడంపై అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ CEOకి లేఖ రాశారు.

బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆస్పత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే.. NTR వైద్య సేవ కింద OP సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ లేఖ రాసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఏపీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆస్పత్రులు వెనక్కు తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్‌ నిర్ణయం తీసుకున్నాయి నెట్‌వర్క్ ఆస్పత్రులు.

ఇటు తెలంగాణలోనూ ఇవాళ మంగళవారం (సెప్టెంబర్ 15) అర్థరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా EHS, JHS బకాయిలు ఇవ్వలేదని నెట్ వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..