Cyclone Michaung: ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను.. ముందస్తు చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.. పలు రైళ్లు రద్దు..

| Edited By: Ravi Kiran

Dec 04, 2023 | 12:33 PM

మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ముందుగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి నంబర్‌ను జారీ చేసింది. దీనితో పాటు, డివిజనల్ ప్రధాన కార్యాలయంలో అదనపు నియంత్రణ, విపత్తు నిర్వహణ గదిని తెరచారు. మిచౌంగ్ తుఫాను కోసం సంక్షోభ నిర్వహణ గదిని తెరిచింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏదైనా సమాచారం లేదా సహాయం అందించడానికి ECoR ద్వారా 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్ కూడా జారీ చేసింది.  రైల్ సదన్‌లోని ECoR ప్రధాన కార్యాలయం, విశాఖపట్నం, ఖుర్దా రోడ్, సంబల్‌పూర్‌లోని డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో విపత్తు నిర్వహణ గదులు తెరవబడ్డాయి.

Cyclone Michaung: ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను.. ముందస్తు చర్యలు చేపట్టిన రైల్వే శాఖ.. పలు రైళ్లు రద్దు..
Cyclone Michaung
Follow us on

బంగాళా ఖాతం తీరంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాను వాయువ్య దిశగా గంటకు 13 కి.మీ వేగంతో కదులుతోంది. తీర ప్రాంతాల్లో ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ముందస్తు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం వివిధ శాఖల కు సంబంధించిన అధికారులతో సమావేశమయ్యారు. మిచౌంగ్ తుఫాను నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ చర్యల్లో భాగంగా ముందుగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి నంబర్‌ను జారీ చేసింది. దీనితో పాటు, డివిజనల్ ప్రధాన కార్యాలయంలో అదనపు నియంత్రణ, విపత్తు నిర్వహణ గదిని తెరచారు.

మిచౌంగ్ తుఫాను కోసం సంక్షోభ నిర్వహణ గదిని తెరిచింది. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ఏదైనా సమాచారం లేదా సహాయం అందించడానికి ECoR ద్వారా 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్ కూడా జారీ చేసింది.  రైల్ సదన్‌లోని ECoR ప్రధాన కార్యాలయం, విశాఖపట్నం, ఖుర్దా రోడ్, సంబల్‌పూర్‌లోని డివిజనల్ హెడ్‌క్వార్టర్స్‌లో విపత్తు నిర్వహణ గదులు తెరవబడ్డాయి. ఇవి 24 గంటలు తెరిచి ఉంటాయి.

సున్నితమైన ప్రదేశాలను గుర్తింపు

మిచౌంగ్ తుఫాను ఎక్కువగా ప్రభావం చూపే ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. సున్నితమైన ప్రదేశాల్లో గస్తీ బృందాలు, వాచ్‌మెన్‌లను నియమించి రైల్వేశాఖ పెట్రోలింగ్‌ను పెంచింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ  మిచౌంగ్ తుఫాను నిర్వహణ, తమ అధికార పరిధిలో దీని ప్రభావ ప్రాంతాల రక్షణ కోసం సంసిద్ధమైయింది.  గ్రౌండ్ వర్క్ చేసింది. ముందస్తు వాతావరణ సూచనలను , ముందస్తు విపత్తు నిర్వహణ అనుభవాలను సద్వినియోగం చేసుకుంటూ మిచౌంగ్ తుఫాను వల్ల ప్రభావితమైనప్పుడు రైలు ట్రాఫిక్, రైల్వే ట్రాక్‌లను వెంటనే పునరుద్ధరించడానికి ECOR ప్రణాళికను సిద్ధం చేసింది.

ఇవి కూడా చదవండి

అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం

ట్రాక్‌లు, సిగ్నలింగ్ సిస్టమ్‌లు, ఓహెచ్‌ఇ ఇన్‌స్టాలేషన్‌ల త్వరిత పునరుద్ధరణ కోసం సున్నిత ప్రాంతాల్లో  నిరంతర పర్యవేక్షణ, వనరులను సత్వర సమీకరణతో అప్రమత్తంగా ఉండాలని ECOR జనరల్ మేనేజర్ మనోజ్ శర్మ అధికారులకు సూచించారు.

సమాచారాన్ని పొందడం కోసం హెల్ప్ లైన్ నెంబర్

హెల్ప్‌లైన్ నంబర్: భువనేశ్వర్ 0674 – 2301525, 2301626, 2303060,

విశాఖపట్నం – (ఈరోజు ఉదయం నుండి యాక్టివ్‌ అవుతుంది. తదనుగుణంగా నంబర్‌లకు తెలియజేయబడుతుంది)

ఖుర్దా రోడ్ – (ఈరోజు ఉదయం నుండి యాక్టివ్‌ అవుతుంది. తదనుగుణంగా నంబర్‌లకు తెలియజేయబడుతుంది)

ఏయే రైళ్లను రద్దు చేశారంటే

ఆదివారం నోటిఫికేషన్‌తో పాటు తుఫాను పరిస్థితుల దృష్ట్యా మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్ల వివరాలు

డిసెంబర్ 3వ తేదీన ప్రయాణించే 17482 తిరుపతి-బిలాస్‌పూర్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి బయలు దేరాల్సి ఉంది. అయితే దీనిని రద్దు చేశారు.

అంతేకాదు డిసెంబర్ 5న బిలాస్‌పూర్ నుండి రానున్న 17481 బిలాస్‌పూర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ని రద్దు చేశారు.

డిసెంబర్ 4వ తేదీన తిరుపతి నుంచి బయలు దేరే.. 17480 తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్ ను కూడా రద్దు చేశారు.

డిసెంబర్ 6వ తేదీన పూరి నుంచి వచ్చే 17479 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ను క్యాన్సిల్ చేశారు.

డిసెంబర్ 6 మరియు 7 తేదీలలో 12509 బెంగళూరు నుండి  బయలు దేరే బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ ను కూడా రద్దు చేశారు.

డిసెంబరు 6న ఎర్నాకులం నుండి వెళ్లే ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్ 18190ను క్యాన్సిల్ చేశారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..