AP Rains: తుఫాన్ ముప్పు బాబోయ్.! ఏపీకి వచ్చే 3 రోజులు కుండపోత.. ఈ జిల్లాలకు అలెర్ట్

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 29 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 10 .6 ° తూర్పు రేఖాంశం 82.6 °వద్ద అదే ప్రాంతములో

AP Rains: తుఫాన్ ముప్పు బాబోయ్.! ఏపీకి వచ్చే 3 రోజులు కుండపోత.. ఈ జిల్లాలకు అలెర్ట్
Ap Rains
Follow us
Ravi Kiran

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 29, 2024 | 3:49 PM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము గత 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఈ రోజు 29 నవంబర్ 2024 భారత కాలమానం ప్రకారం ఉదయం 08.గం.30 ని .లకు ,ఉత్తర అక్షాంశం 10 .6 ° తూర్పు రేఖాంశం 82.6 °వద్ద అదే ప్రాంతములో కేంద్రీకృతమై ఉంది. ఇది ట్రింకోమలీ(శ్రీలంక)కి ఉత్తర ఈశాన్యముగా 270 కి.మీ, నాగపట్టణానికి తూర్పుగా 300 కి.మీ., పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 340 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇది వాయువ్య దిశగా కదిలి, బలపడి రానున్న 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది.ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ,నవంబర్ 30 వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి దగ్గర , కారైకాల్, మహాబలిపురం తీరాల మధ్య, పుదుచ్చేరికి సమీపంలో , గంటకు 70-80 కి.మీ., గరిష్టంగా 90 కి .మీ ఈదురుగాలుల వేగంతో ఈ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది.

———————————- వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన : —————

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :- —————————————-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :- ——————————

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాల తో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-30 -40 కి మీ వేగం,గరిష్టం గా 50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు, గంటకు-30 -40 కి మీ వేగం,గరిష్టం గా 50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

రాయలసీమ:- ———————-

ఈరోజు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాల తో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-30 -40 కి మీ వేగం,గరిష్టం గా 50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

రేపు:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు,గంటకు-30 -40 కి మీ వేగం,గరిష్టం గా 50 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది

ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి