Cyclone Ditwah: ఏపీ వైపు దూసుకొస్తున్న దిత్వా తుఫాన్.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
మొన్న మొంథా.. నిన్న సెన్యార్, ఇప్పుడు దిత్వా. ఒక తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది. ఇలా వరుస తుఫాన్లు వణుకు పుట్టిస్తున్నాయి. దీని టార్గెట్ కూడా ఏపీనే. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది..? వెదర్ ఆఫీర్స్ ఏం చెబుతున్నారు..?

LIVE NEWS & UPDATES
-
ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు..
దిత్వా తుఫాన్ ప్రభావంతో సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావారణశాఖ అంచనా వేసింది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
-
రేపు ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు
దిత్వా తుఫాను కారణంగా సోమవారం అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
-
-
దిత్వా తుఫాను బలహీనం..
దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. తీరానికి సమాంతరంగా తీవ్ర వాయుగుండం ప్రయాణిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చెన్నైకు 140, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల నుండి తీవ్ర వాయుగుండం దూరం 80 కిలోమీటర్లు ఉంది. ఉత్తర దిశగా ప్రయాణిస్తు రేపు ఉదయానికి వాయుగుండంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
-
బలహీనపడిన దిత్వా తుఫాన్
- తీవ్రవాయుగుండంగా బలహీనపడిన దిత్వా తుపాను
- రేపు ఉదయానికి వాయుగుండంగా బలహీనపడనుంది
- డిచిన 6 గంటల్లో 5కిమీ వేగంతో కదిలిన తుపాను
- ముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
- సోమవారం దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
-
వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం
దిత్వా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ప్రసవానికి దగ్గర్లో 7,871 మంది గర్భిణులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఇప్పటికే 375 మందిని ఆస్పత్రికి తరలించారు. వైద్య శిబిరాల నిర్వహణకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు.
-
-
రేపు ఈ జిల్లాలో అతిభారీ వర్షాలు
- సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
- ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – ప్రఖర్ జైన్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
-
గోడ కూలి ఇద్దరు..కరెంట్ షాక్‌తో ఒకరు మృతి
ఇక దిత్వా తుఫాన్ తమిళనాడు తీర ప్రాంతంపై విరుచుకుపడుతోంది. గోడ కూలి ఇద్దరు, కరెంట్ షాక్‌తో ఒకరు చనిపోయారు. తమిళనాడులో దాదాపు 56వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. మైలాదుతురైలో 24 గంటల్లో 22 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అనేక ప్రాంతాల్లో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్ సహాయక చర్యల కోసం 38 టీములను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
-
-
శ్రీలంకలో 212 మంది మరణం
దిత్వా తుఫాన్‌తో శ్రీలంకలో మరణించిన వారి సంఖ్య 212కు పెరిగింది. మరో 218 మంది జాడ తెలియడం లేదు. ఈ తుఫాన్ కారణంగా దాదాపు 3 లక్షల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. వర్షాలు వరదలతో విలవిల్లాడుతున్న శ్రీలంకకు ఆపన్న హస్తం అందించింది భారత్. వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేర్చింది. కోట్‌మలె ప్రాంతంలో చిక్కుకుపోయిన 24మందిని గరుడ కమెండోలు రక్షించారు.
-
ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
- దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
- సోమవారం కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు..
- నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు
- ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
-
సోమవారం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
- దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
- సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
- కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం..
- కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
కాసేపట్లో తీవ్రవాయుగుండంగా
- నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్
- ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతున్న తుఫాన్
- మరికాసేపట్లో తీవ్రవాయుగుండంగా బలహీనపడే అవకాశం
- ప్రస్తుతానికి ఇది కారైకాల్ కి 120 కి,మీ., పుదుచ్చేరికి 90 కి.మీ, చెన్నైకి 150కి.మీ దూరంలో కేంద్రీకృతం
- గడిచిన 6 గంటల్లో 5 కి.మీ వేగంతో కదిలిన తుఫాన్
-
ఏపీకి ఫ్లడ్ అలర్ట్
- ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ
- ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావచ్చన్న అధికారులు
- నెల్లూరుకు ప్రమాదం ఎక్కువగా ఉందన్న అంచనాలతో పెద్ద ఎత్తున NDRF సిబ్బంది మోహరింపు
- వరదలు ప్రమాదకర స్థాయిలో వస్తే సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా సిబ్బంది
-
రేపటికి వాయుగుండగా..
ఇవాళ రాత్రికి దిత్వా తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా, రేపటికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అంటున్నారు. తుఫాన్ బలహీనపడినా, దక్షిణ కోస్తాకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
-
తమిళనాడుపై తుఫాన్ ఎఫెక్ట్
తమిళనాడుపై దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ చూపిస్తోంది. దీంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరులో కాలనీలు నీట మునిగాయి. చెన్నై మెరీనా బీచ్‌ను అధికారులు మూసివేశారు. కడలూరు, నాగపట్నం, మైలాదుతురై, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా, ఉత్తర దిశలో కదులుతోంది. తమిళనాడులో అధికారులు ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అని జనం భయాందోళనకు గురవుతున్నారు.
-
తుఫాన్‌పై మంత్రి పార్థసారథి సమీక్ష..
తుఫాన్‌పై మంత్రి పార్థసారథి సమీక్ష నిర్వహించారు. ఆస్తి, పంటనష్టం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యం సేకరణకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీ విద్యుత్‌శాఖ అప్రమత్తం అయ్యింది. APCPDCL సర్కిల్స్ పరిధిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
-
నెల్లూరు.. తిరుపతి.. చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
దిత్వా తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరుకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
-
మూడు జిల్లాల ప్రజలకు అలర్ట్..
- ఏపీ వైపు దూసుకొస్తున్న దిత్వా తుపాన్
- తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
- ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి – ప్రఖర్ జైన్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ
-
తీర ప్రాంతానికి దగ్గరగా తుపాన్..
నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఈ తుపాను తీర ప్రాంతాలకు దగ్గరగా కొనసాగుతూ.. రాబోయే 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తుపాను ప్రస్తుత స్థానం
- కారైకాల్‌కు: 100 కిలోమీటర్ల దూరంలో
- పుదుచ్చేరికి: 110 కిలోమీటర్ల దూరంలో
- చెన్నైకి: 180 కిలోమీటర్ల దూరంలో
-
దిత్వా తుఫాన్‌పై హోంమంత్రి అనిత సమీక్ష
దిత్వా తుఫాన్‌పై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష
నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఇవాళ, రేపు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచన
ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మంత్రి
కంట్రోల్ రూమ్‌కు వచ్చే కాల్స్‌కు వెంటనే స్పందించాలని ఆదేశం
విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించాలన్న హోంమంత్రి అనిత
అన్ని ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్లు.. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్నామని వివరణ
-
ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ
ఉమ్మడి కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఆకస్మిక వరదలు రావచ్చంటున్నారు అధికారులు
ఈ జిల్లాల్లో రేపు ఉదయం 5 గంటల 30 నిమిషాల్లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఈ మ్యాప్‌లో రెడ్‌గా కనిపించే ప్రాంతానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. నెల్లూరు జిల్లా రెడ్‌గా కనిపిస్తోంది.
ఆరెంజ్ కలర్ ఉన్న ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షం కురుస్తుంది. ఎల్లో కలర్ ఉన్న ప్రాంతాల్లో రిస్క్ పెద్దగా ఉండదని అంటున్నారు అధికారులు
-
శ్రీలంక ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన ఏపీ వాసులు
దుబాయ్ నుంచి చెన్నై వస్తుండగా తుఫాన్ తాకిడికి శ్రీలంకలో ఫ్లైట్ నిలిపివేత
సాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో తమ ఆవేదనను పంచుకున్న ప్రయాణికులు
ఇబ్బందుల్లో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలంటూ అధికారులకు సూచించారు ఏపీ మంత్రి లోకేష్
ఇందుకోసం కొలంబో, చెన్నై అధికారులతో మాట్లాడి వారిని క్షేమంగా తీసుకురావాలంటూ సూచన
-
దిత్వ తుఫాన్ ప్రభావంతో శ్రీలంక అతలాకుతలం.. 150 మంది మృతి
కొండచరియలు విరిగిపడి 150 మంది మృతి
దేశ వ్యాప్తంగా నీటి మునిగిన అనేక ప్రాంతాలు
ప్రమాదంలో ఉన్న వారిని కాపాడుతున్న సహాయక సిబ్బంది
21 టన్నుల సహాయక సామగ్రి అందించిన భారత్
-
గంటకు 5 కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాన్
తమిళనాడు వైపుగా కదులుతున్న తుఫాన్ దిత్వ
తమిళనాడులో తీర ప్రాంత జిల్లాలకు సమాంతరంగా కదలనున్న తుఫాన్.
పుదుచ్చేరి నుంచి చెన్నై మధ్యలో ఎక్కువగా ప్రభావం
చెన్నై, పుదుచ్చేరి బీచ్ ల మూసివేత
రామేశ్వరం, తూతుకూడి, నాగపట్నం లో నీట మునిగిన ప్రాంతాలు
తిరువారూరులో 14 సెంటీమీటర్ల వర్షపాతం
చెన్నైకి 250, పుదుచ్చేరి160, వేదరణ్యం 100 కి. మీ దూరంలో తుఫాన్
-
తుఫాన్ హెచ్చరికలు.. ఆ జిల్లాల్లో ముందస్తు సహాయక చర్యల ఏర్పా్ట్లు
నైరుతి బంగాళాఖాతం కొనసాగుతున్న తుఫాన్ దిత్వ
తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు
కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
అదనంగా మరో 3 బృందాలు సిద్ధం చేసిన అధికారులు
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్ధమైన అధికారులు
-
తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల దిత్వ తుఫాన్ ప్రభావం చూపుతోంది. శ్రీలంక సమీపంలోని బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాన్ ఉత్తర వాయువ్య దిశలో కదులుతూ వేగంగా భారత్ వైపు దూసుకొస్తుంది. ఈ తుపాన్ మరికొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత సమీపానికి చేరుకోనుంది.
ఈ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ
ఇక సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈ తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
-
దిత్వ ఎఫెక్ట్.. ఏపీకి మూడు రోజుల భారీ వర్ష సూచన
కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక
మిగిలిన అన్ని పోర్టుల్లో కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
మూడు రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన
దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు
-
దూసుకోస్తున్న దిత్వ తుఫాన్.. మరికొన్ని గంటల్లో తీరానికి చేరే అవకాశం
బంగాళాఖాతంలో దిత్వ తుఫాను
భారత్ వైపు కదులుతున్న దిత్వ
గడచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో తుఫాను గమనం
కారైకల్ కు తూర్పున 80 కి.మీ., వేదరన్నియంకు తూర్పున 100 కి.మీ., చెన్నైకు 250, పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతం
ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను
మరికొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత సమీపానికి చేరుకోనున్న దిత్వ
తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న తుఫాను
-
చెన్నైకి 290 కిలో మీటర్ల దూరంలో..
దిత్వా తుఫాన్ ప్రస్తుతానికి కారైకల్ కి 100 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 190 కిలో మీటర్లు, చెన్నైకి 290 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
-
రాబోయే 3 గంటల్లో ఈ రెండు జిల్లాలో భారీ వర్షాలు
రాబోయే 3 గంటల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మెరుపులతో కూడిన తేలికపాటి ఉరుములు గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
-
జిల్లా ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ
దిత్వా తుఫానుపై నెల్లూరు జిల్లా ప్రజలను మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాకు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారాయణ సూచించారు. తుపాన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు మంత్రి. అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
-
ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్
దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ, ఈ రోజు (శనివారం) అర్ధరాత్రి నాటికి తమిళనాడు నుంచి 60 కిలో మీటర్లు, పుదుచ్చేరి నుంచి 50 కిలో మీటర్లు, కోస్ట్‌లైన్ నుండి కనీసం 25 కిలో మీటర్ల దూరంలో నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
పరిస్థితిని సమీక్షించిన రైల్వే మంత్రి
దిత్వా తుఫాను దృష్ట్యా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దక్షిణ రైల్వే బృందాలతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. బోర్డు, జోనల్, డివిజనల్ స్థాయిలో వార్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రైల్వేలు పౌర, అధికారులతో సమన్వయం చేసుకుంటూ సాధారణ స్థితి తిరిగి వచ్చే వరకు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి అని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
-
తుఫాన్ లైవ్ ట్రాకింగ్ చేయండి…
దిగువన ఇచ్చిన లింక్‌లో మీరు తుఫాన్ ఎక్కడుందో లైవ్ ట్రాకింగ్ చేయవచ్చు….
https://www.windy.com/-Hurricane-tracker/hurricanes/ditwah?satellite,7.014,82.090,5
-
దిత్వా తుపాను.. తమిళనాడు హై అలర్ట్
దిత్వా తుపాను కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు తుపాను కదులుతున్న నేపథ్యంలో ఆయా విభాగాలు అలెర్టయ్యాయి. భారీ వర్షాల కారణంగా తమిళనాడులో అనేక విమాన సర్వీసులు రద్దు కావడంతోపాటు స్కూల్స్, కళాశాలలు సెలవులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఇండిగో ప్యాసింజర్స్‌కు సూచన చేయగా, తాజాగా ఎయిరిండియా కూడా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్‌మెంట్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఎస్టీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ సహా 28 విపత్తు ప్రతిస్పందన దళాలను తమిళనాడు సర్కార్ రంగంలోకి దించింది. వైమానిక, కోస్ట్‌గార్డ్ కూడా అలెర్ట్ అయ్యాయి.
-
దిత్వా తుపానుతో జాగ్రత్త…
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుపాను ప్రస్తుతానికి కారైకల్ కి 100 కి.మీ., పుదుచ్చేరికి 190 కి.మీ., చెన్నైకి 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వైపు శనివారం అర్ధరాత్రి నాటికి 60 కి.మీ, రేపు ఉదయానికి 50 కి.మీ, సాయంత్రానికి 25 కి.మీ కనీస దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని వివరించారు.
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక మీదుగా కొనసాగుతున్న దిత్వా తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో ఉత్తరం వైపుకు కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది ప్రస్తుతానికి కారైకల్ కి 120 కి.మీ., పుదుచ్చేరికి 220 కి.మీ., చెన్నైకి 330 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు. తుపాను ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ రేపు తెల్లవారుజామునకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానికి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాల సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందన్నారు. తమిళనాడు-పుదుచ్చేరి తీరప్రాంతం నుండి నైరుతి బంగాళాఖాతం వైపు శనివారం అర్ధరాత్రి నాటికి 60 కి.మీ, రేపు ఉదయానికి 50 కి.మీ, సాయంత్రానికి 25 కి.మీ కనీస దూరంలో కేంద్రీకృతమై ఉండే అవకాశం ఉందని వివరించారు. మత్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దిత్వా తుపాను ప్రభావంతో రానున్న రెండు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రానున్న రెండు రోజులు వాతావరణ వివరాలు క్రింది విధంగా ఉండనున్నట్లు తెలిపారు.
ఆదివారం (30-11-2025) : ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సోమవారం (01-12-2025) : ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు; కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
హోం,విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి గారి ఆదేశాలనుసారం అత్యవసర సహాయక చర్యల కోసం కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు. స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాల్లో మండలస్థాయి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చామన్నారు.
ముందస్తుగానే ప్రభుత్వ శాఖల వారీగా తీసుకోవాల్సిన ఉపశమన చర్యలపై ఆదేశాలు జారీ చేశామన్నారు.సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారులని వెనక్కి రప్పించామని, రైతాంగానికి భారీవర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నామన్నారు. భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Published On - Nov 29,2025 9:31 PM
