Andhra Pradesh: సినిమాను మించిన కేసు.. ఖాతాదారుల ప్రమేయం లేకుండా మాయమవుతున్న డబ్బులు..

| Edited By: Shiva Prajapati

Aug 11, 2023 | 10:09 AM

ఆత్మకూరు పట్టణంలోని SBI, యూనియన్ బ్యాంక్. కొత్తపల్లిలోని SBI బ్యాంక్ కు చెందిన పలు ఖాతాదారుల అకౌంట్‌లో ఈనెల 5 నుండి ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 70 మంది ఖాతాదారుల నుండి లక్షల రూపాయలలో డబ్బులు విత్ డ్రా కావడంతో బాధితులు బ్యాంకులు, పోలీస్ స్టేషన్ చుట్టూ పరుగులు తీస్తున్నారు. కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును బ్యాంకుల్లో తమకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం, ఆధార్ అప్డేట్, ఇతర అవసరాల కోసం వేసిన వేలిముద్రలను అక్రమంగా ఉపయోగించుకుని పేదలు, నిరక్షరాస్యులను..

Andhra Pradesh: సినిమాను మించిన కేసు.. ఖాతాదారుల ప్రమేయం లేకుండా మాయమవుతున్న డబ్బులు..
Money
Follow us on

సైబర్ నెరగాళ్లు రెచ్చిపోతున్నారు. విశాల్ నటించిన అభిమన్యుడు సినిమాను తలపించేలా ఖాతాదారుల ప్రమేయం లేకుండా అకౌంట్లో నుండి డబ్బులను మాయం చేస్తున్నారు. ఆత్మకూరు పట్టణంలోని SBI, యూనియన్ బ్యాంక్. కొత్తపల్లిలోని SBI బ్యాంక్ కు చెందిన పలు ఖాతాదారుల అకౌంట్‌లో ఈనెల 5 నుండి ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 70 మంది ఖాతాదారుల నుండి లక్షల రూపాయలలో డబ్బులు విత్ డ్రా కావడంతో బాధితులు బ్యాంకులు, పోలీస్ స్టేషన్ చుట్టూ పరుగులు తీస్తున్నారు. కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్మును బ్యాంకుల్లో తమకు తెలియకుండానే సైబర్ నేరగాళ్లు దోచుకోవడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ పథకాల కోసం, ఆధార్ అప్డేట్, ఇతర అవసరాల కోసం వేసిన వేలిముద్రలను అక్రమంగా ఉపయోగించుకుని పేదలు, నిరక్షరాస్యులను టార్గెట్ చేస్తూ వారి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులను సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు.

తాము డబ్బు తీసుకోకున్నా.. ఖాతాలు నుంచి నగదు విత్ డ్రా చేసినట్లు మొబైల్ ఫోన్లకు సందేశం రావడంతో బాధితులు బ్యాంకులకు, పోలీస్ స్టేషన్ చుట్టూ పరుగులు తీస్తున్నారు. ఖాతాదారులు బ్యాంకుల వద్దకు వెళ్లి విచారిస్తే వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల చాలామంది మహిళల ఖాతాల్లో అమ్మ ఒడి నగదు జమైంది. చాలామంది సీఎస్పీ కేంద్రాలకు వెళ్లి డబ్బులు తీసుకున్నారు. బ్యాంకుల్లో రద్దీ అధికంగా ఉండటం, సర్వర్లు పని చేయకపోవడంతో కొందరు సీఎస్పీ కేంద్రాలను సంప్రదించారు. ఇలా ప్రభుత్వ పథకాల కోసం, ఆధార్ అప్డేట్ చేసుకునే సమయంలో వేలిముద్రలు వేశామని కొంతమంది బాధితులు చెబుతున్నారు. వారి ఆధార్, వ్యక్తిగత వివరాలు బహిర్గతం కావడంతో ఆధునిక సాంకేతికను వినియోగించి వేలిముద్రలు చోరీ చేసి నగదు తస్కరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. మరికొందరు స్థలాలు పొలాల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్‌లో వేలిముద్రలు వేసామని అక్కడ ఏమైనా పొరపాటు జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కష్టపడి సంపాదించి బ్యాంకుల్లో దాచుకున్న సొమ్మును తమకు తెలియకుండానే ఇతరులు దోచుకోవడంతో ఖాతాదారులు కలవరం చెందుతున్నారు. ప్రభుత్వ పథకాల కోసం, ఆధార్ అప్డేట్, ఇతర అవసరాల కోసం వేసిన వేలిముద్రలను అక్రమంగా ఉపయోగించుకుని తాము డబ్బు తీసుకోకున్నా.. ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేసినట్లు మొబైల్ ఫోన్లకు సందేశం రావడంతో బాధితుల బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఆత్మకూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు చెందిన పలువురి బ్యాంకు ఖాతాల నుంచి వరుసగా మూడు రోజులపాటు నగదు తీసుకున్నారు. ఒక్కొక్కరి ఖాతా నుంచి రూ.6,500 రూ.7,000, రూ.9000 రూ.11,000, రూ.20,000 తీసుకున్నారు.

మండలంలోని బైర్లూటి, నాగలూటి గూడేలకు చెందిన నలుగురు ఖాతాల నుంచి 30 వేలు, రూ.40 వేలు, రూ.50 వేలు జిల్లా చొప్పున దోచుకున్నారు. ఖాతాదారుల్లో ఇప్పటి వరకు సుమారు 70 మంది బాధితులను ఉన్నట్టు సమాచారం.. ఖాతాదారులు బ్యాంకుల వద్దకు వెళ్లి విచారిస్తే వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇటీవల చాలామంది మహిళల ఖాతాల్లో అమ్మఒడి నగదు సీఎస్పీ కేంద్రాలకు వెళ్లి డబ్బులు తీసుకున్నారు. బ్యాంకుల్లో రద్దీ అధికంగా ఉండటం, సర్వ పని చేయకపోవడంతో కొందరు సిఎస్పీ కేంద్రాలను సంప్రదించారు. ఇలా ప్రభుత్వ పథకాల కోసం, ఆధార్ అప్డేట్ చేసుకునే సమయంలో వేలిముద్రలు వేశామని చొప్పున కొంతమంది బాధితులు చెబుతున్నారు. ఆధార్, వ్యక్తిగత వివరాలు బహిర్గతం కావడంతో ఆధునిక వినియోగించి వేలిముద్రలు చోరీ చేసి నగదు తస్కరిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఆత్మకూరు SBI లో పనిచేస్తున్న పీల్డ్ అపిసర్ ఇంట్లో నలుగురి ఖాతల నుండి అమౌంట్ కట్ కావడం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..