AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏపీ మంత్రి బ్యాంక్ ఖాతాలకే ఎసరు పెట్టారు.. ఏకంగా..!

సైబర్ క్రైమ్ నిత్యం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వినే మాట..! చదువురాని నిరక్షరాస్యులు నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు నిత్యం ఎవరో ఒకరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకుంటున్నారు.ఇటు సామాన్య ప్రజల నుంచి ఏకంగా మంత్రుల వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఫోన్ ట్రాప్ చేయడం.. బంధువులకు మెసేజ్ చేయడం.. లక్షల రూపాయలు నుంచి కోట్ల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం ఇటీవల కాలంలో చాలానే చూశాం.

వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏపీ మంత్రి బ్యాంక్ ఖాతాలకే ఎసరు పెట్టారు.. ఏకంగా..!
Cyber Crime
Ch Murali
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 23, 2025 | 10:50 AM

Share

సైబర్ క్రైమ్ నిత్యం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వినే మాట..! చదువురాని నిరక్షరాస్యులు నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు నిత్యం ఎవరో ఒకరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకుంటున్నారు.ఇటు సామాన్య ప్రజల నుంచి ఏకంగా మంత్రుల వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఫోన్ ట్రాప్ చేయడం.. బంధువులకు మెసేజ్ చేయడం.. లక్షల రూపాయలు నుంచి కోట్ల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం ఇటీవల కాలంలో చాలానే చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ నిర్వహించే విద్యాసంస్థలనే బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. నారాయణ అల్లుడు పేరుతో సైబర్ నేరగాళ్లు ఇన్స్‌స్టిట్యూట్ అకౌంటెంట్ మెయిల్ చేసి బోల్తా కొట్టించారు. అర్జెంటుగా రూ.1.96 కోట్లు డబ్బు కావాలంటూ నారాయణ అల్లుడు పేరుతో మెసేజ్ చేసి నగదు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ సంఖ్య ఏపీలో భారీగా పెరిగింది. ఒక్క మెసేజ్ తో అకౌంట్లు ఖాళీయే పరిస్థితి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అయితే సామాన్యుల నుంచి ఉన్నతస్థాయి లో ఉన్న వారు సైతం ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఒకసారి అకౌంట్లో నుంచి డబ్బు మాయమైతే తిరిగి రికవరీ చేసుకోలేని పరిస్థితిలో కొన్ని వేలమంది ఇబ్బందులు పడుతున్నారు. తాజగా ఒక్క మెసేజ్ తో రూ 1.96 కోట్లు నగదు ట్రాన్స్‌ఫర్ చేయించిన ఘటన నెల్లూరులో ఇటీవల కలకలం రేపింది. ఏపీ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అల్లుడు పునీత్ ని బురిడీ కొట్టించారు సైబర్ నేరగాళ్లు.

పునీత్ పేరుతో నారాయణ ఇన్స్‌స్టిట్యూట్ అకౌంటెంట్‌కు మెసేజ్ పెట్టారు సైబర్ నేరగాళ్ళు. అర్జెంటుగా రూ. 1.96 కోట్లు నగదు కావాలని బిజినెస్ డీల్ సంబంధించి నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలంటూ ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చారు. అయితే మెసేజ్ చేసింది సాక్షాత్తు మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కావడంతో క్షణం ఆలోచించకుండా అకౌంటెంట్‌లోని నగదును సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్ కి ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే కొన్ని గంటలకే విషయం గుర్తించిన అకౌంటెంట్ సైబర్ క్రైమ్ జరిగిందంటూ యాజమాన్యానికి తెలిపింది. దీంతో సైబర్ క్రైమ్ జరిగిందని గుర్తించిన నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బ్యాంక్ అకౌంట్ ఆధారంగా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ తో విచారణ చేపట్టిన పోలీసులు ఉత్తరప్రదేశ్ కు చెందిన ముగ్గురు కలిసి ఈ సైబర్ క్రైమ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిలో అరవింద్ కుమార్, సంజీవ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అలాగే సైబర్ క్రైమ్ జరిగిన రూ.1.96 కోట్లలో రూ.1.40 కోట్లు నగదు ను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..