AP Curfew Timings: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. రాష్ట్రంలో గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు..

AP Curfew Timings: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు
Ap curfew

Edited By:

Updated on: Jun 10, 2021 | 9:08 PM

Andhra Pradesh Curfew: ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి కర్ఫ్యూను సడలించనున్నారు. రాష్ట్రంలో గురువారం వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇవ్వగా.. శుక్రవారం నుంచి ఈ రిలాక్సేషన్ సమయాన్ని మరో రెండు గంటల పాటు ఏపీ ప్రభుత్వం పెంచింది. దీనితో రేపటి నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు ఉండనుంది. ఈ నిబంధనలు జూన్ 20వ తేదీ వరకు అమలులో ఉంటాయని వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అనిల్ సింఘాల్ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మ.2 గంటల వరకు పనిచేయనున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అటు రెండు గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను అనిల్ సింఘాల్ ఆదేశించారు.

బ్యాంకుల సమయాల్లోనూ మార్పు..

ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి బ్యాంకులు టైమింగ్స్‌లో మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని బ్యాంకులు రేపటి నుంచి జూన్ 20వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పని చేస్తాయని ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అలాగే సాయంత్రం 4 గంటల వరకు బ్యాంక్ సిబ్బంది డ్యూటీ చేస్తారని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు బ్యాంక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విధులు జరుగుతాయని స్పష్టం చేశారు.

ఏపీలో కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 97,863 శాంపిల్స్‌ పరీక్షించగా, 8,110 మంది కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఇప్పటివరకు 17,87,883 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇందులో ప్రస్తుతం 99,057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకుని బయటపడటంతో.. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 16,77,063కి చేరింది. నిన్న కరోనాతో పోరాడుతూ 67 మంది మృత్యువాతపడ్డారు.

Also Read:

పల్లీలు, బెల్లం కలిపి తింటున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

పెళ్లైన తొలి రాత్రే వధువుకు దిమ్మతిరిగే షాకిచ్చిన భర్త.. అసలు ఏం జరిగిందంటే.!

 మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! ఈ రోగాలు రావొచ్చు!