Corona Vaccine: ఏపీ ఆరోగ్య శాఖ షాకింగ్ న్యూస్.. ఇవాళ మొదటి డోస్ వ్యాక్సిన్ నిలిపివేత.. రెండో డోస్ మాత్రమే.. కారణం అదేనా?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Corona Vaccine: ఏపీ ఆరోగ్య శాఖ షాకింగ్ న్యూస్.. ఇవాళ మొదటి డోస్ వ్యాక్సిన్ నిలిపివేత.. రెండో డోస్ మాత్రమే.. కారణం అదేనా?
Corona Vaccine Doses
Follow us

| Edited By: Team Veegam

Updated on: Apr 22, 2021 | 11:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.. ఇప్పటికే ఏపీలో ఒక రోజులో నమోదైన కేసుల సంఖ్య పది వేల మార్కుకు చేరువైంది. కేవలం ఏపీ ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం కరోనా కారణంగా చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. మరోవైపు ప్రస్తుతానికి దేశంలో లాక్ డౌన్ ఉండదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ, పరిస్థితి అయితే చేయిదాటిపోయినట్టే కనిపిస్తోంది. నమోదవుతున్న కేసులు చూస్తుంటే. అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు విధించాయి. మహారాష్ట్రంలో ఏకంగా లాక్‌డౌన్ విధించింది ఆరాష్ట్ర ప్రభుత్వం. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. ప్రజలంతా బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.

పలు రాష్టాల్లో నైట్ కర్ఫ్యూ విధించినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అలాంటి చర్యలను ప్రకటించలేదు. కొన్ని జిల్లాల్లో పరిస్థితులు బట్టి అక్కడి అధికారులే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రోజూ వేయికి పైగా కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే, ఈ పెరుగుతున్న కరోనా కేసులకు వ్యాక్సినేషన్ ఒక్కటే సరైన ఆయుధం అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ కూడా పంపిణీ చేసింది. అంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. దీంతో ఇప్పుడు ఇప్పడు అంతా వ్యాక్సినేష్ వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు.

ఏపీలో మొన్నటి వరకు చాలా చోట్ల వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. అందుకే కరాణంగా నిల్వలు లేకపోవడమే. మళ్లీ కేంద్రం రాష్ట్రానికి వ్యాక్సిన్ డోస్ లు పంపించడంతో తిరిగి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గురువారం చాలామంది వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. కానీ అలాంటి వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ షాక్ ఇస్తోంది. ఇటీవల నిల్వలు లేక ఏపీలో చాలా చోట్ల కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ఇఫ్పుడు కేంద్రం నుంచి మళ్లీ వ్యాక్సిన్ డోస్ రావడంతో వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. కానీ, తొలి డోస్ వ్యాక్సిన్ వేయించుకుందామనుకునే వారికి వైద్య ఆరోగ్య శాఖ షాక్.. ఇంతకు ముందు ఫస్ట్‌ డోస్‌ తీసుకున్న వారికి మాత్రమే గురువారం ఏపీలో సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.. ఇవాళ ఫస్ట్‌ డోస్‌ తీసుకోవాలి అనుకున్న వారు శుక్రవారం వరకు నిరిక్షీంచాల్సిందేనని స్పష్టం చేశారు.

అయితే, అందరూ వ్యాక్సిన్ రెండో డోస్ వారు మాత్రమే తీసుకోవాలని కోరింది వైద్య ఆరోగ్య శాఖ. దాదాపు ఐదు లక్షల కోవిషీల్డ్, లక్ష కోవాక్సిన్ డోసులు ఆయా జిల్లాలకు సరఫరా చేశామన్నారు. అయితే గురువారం ఎవరికీ మొదటి డోస్ వెయడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని అంతా గమనించాలని కోరారు. ఎందుకంటే గురువారం కేవలం రెండో డోస్ మాత్రమే వేస్తారని వెల్లడించారు. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తొలి డోస్ తీసుకుని ఎదురు చూస్తున్నవారికి రెండో డోస్ ఇవ్వాలని వైద్యాధికారులు భావిస్తున్నారు.

Read Also:   Covid 19 Vaccine: భారతీయులకు శుభవార్త.. ఆగస్టు నాటికి అందుబాటులోకి మరో వ్యాక్సిన్.. హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి

కరోనాను జయించిన మొదటి దేశం ఇదే … మాస్కులు వేసుకోనక్కర్లేదని అధికారికంగా ప్రకటన

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..

Coronavirus Symptoms: మీకు ఈ విధంగా దగ్గు వస్తుందా..? అయితే కరోనా లక్షణాలే కావొచ్చు.. ఎందుకంటే..?

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!