Andhra Pradesh: నమ్మకంతో చిట్టీలు కట్టిన జనాలు.. చివరికి రూ.8 కోట్ల చిట్టీ డబ్బులతో పరారైన దంపతులు

|

Jun 26, 2023 | 5:22 AM

సాధారణంగా ఇంట్లో డబ్బులు ఉంటే ఖర్చయిపోతాయనే భయంతో రూపాయి.. రూపాయి పొదుపు చేసి ఆ డబ్బులను చిట్టీలుగా కడుగుతుంటారు జనాలు. అయితే.. ఇదే అలుసుగా భావించిన కొందరు కేటుగాళ్లు మాత్రం.. నమ్మకంగా కొన్నాళ్లు చిట్టీలు నడిపి.. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు కనబడగానే జనాలను చీటింగ్‌ చేసేస్తున్నారు.

Andhra Pradesh: నమ్మకంతో చిట్టీలు కట్టిన జనాలు.. చివరికి రూ.8 కోట్ల చిట్టీ డబ్బులతో పరారైన దంపతులు
Money
Follow us on

సాధారణంగా ఇంట్లో డబ్బులు ఉంటే ఖర్చయిపోతాయనే భయంతో రూపాయి.. రూపాయి పొదుపు చేసి ఆ డబ్బులను చిట్టీలుగా కడుగుతుంటారు జనాలు. అయితే.. ఇదే అలుసుగా భావించిన కొందరు కేటుగాళ్లు మాత్రం.. నమ్మకంగా కొన్నాళ్లు చిట్టీలు నడిపి.. ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో డబ్బులు కనబడగానే జనాలను చీటింగ్‌ చేసేస్తున్నారు. చిట్టీల పేరుతో డబ్బులు దండుకుని పరార్‌ అవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత పెరిగిపోతున్నాయి. మోసాల బారిన పడి కొందరు బాధపడుతుంటే.. మరికొందరు మాత్రం ధైర్యం చేసి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం నల్లసానిపల్లెలో చిట్టీల పేరుతో చీటింగ్ చేశారు శంకరయ్య-జ్యోతి అనే దంపతులు.

వీళ్లిద్దరూ.. స్థానికంగా 5 లక్షల నుంచి 25 లక్షల వరకు చిట్టీలు నడిపి కోట్లలో లావాదేవీలు నడిపేవారు. కొన్నాళ్లుగా నమ్మకంగా ఉంటుండటంతో వందలాది మంది చిట్టీలు కట్టారు. ఆ నమ్మకమే ఇప్పుడు ఆ వందలాది మందిని బాధితులుగా తయారు చేసింది. సుమారు 8 కోట్ల చిట్టీల డబ్బులతో ఉడాయించారు శంకరయ్య-జ్యోతి దంపతులు. అయితే.. చిట్టీల గడుపు పూర్తి అయినా తిరిగి చెల్లించకుండా పరారవడంతో గంగవరం పోలీసులను ఆశ్రయించారు భాదితులు. రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి ఎస్కేప్‌ అవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దంపతుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే.. చిట్టీల డబ్బులతో శంకరయ్య-జ్యోతి దంపతులు.. బినామీ పేర్లతో పలమనేరులో పలు ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. ఏదేమైనా.. మోసపోయిన బాధితులకు పోలీలసులు ఎలా న్యాయం చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం