AP Corona: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు.. తాజా అప్డేట్స్..

|

Jan 30, 2022 | 6:35 PM

Andhra Pradesh Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌

AP Corona: ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. పెరుగుతున్న మరణాలు.. తాజా అప్డేట్స్..
Ap Corona Cases
Follow us on

Andhra Pradesh Covid-19 Updates: దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో సైతం కరోనా తీవ్రత పెరుగుతోంది. చాలా జిల్లాల్లో రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల వ్యవధిలో (శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం 9 గంటల వరకు) 39,296 శాంపిల్స్ ని పరీక్షించగా 10,310 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ (Coronavirus) మహమ్మారి కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న కరోనా నుంచి 9,692 మంది కోలుకున్నారు.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,70,491 కి చేరగా.. మరణాల సంఖ్య 14,606 కి పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి 21,39,854 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,24,45,428 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

కరోనాతో ఎక్కువగాగా కడప, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మరణించగా.. నెల్లూరులో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కాగా కొత్తగా వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా 1697 కేసులు వెలుగుచూశాయి. కర్నూలులో 1379, గుంటూరులో 1249, కృష్ణా 1008 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలవారీగా కరోనా కేసుల వివరాలు దిగువ పట్టికలో చూడండి..

Also Read:

Viral Video: ఏనుగమ్మా ఏనుగు.. పాలు తాగుతూ ఆటలాడుకున్న చిన్నారి.. షాకింగ్ వీడియో

CM KCR: తగ్గేదెలే.. కేంద్రంతో తేల్చుకునుడే.. ఎంపీలతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం..