Coronavirus: ఏపీఆర్టీసీ బస్ భవన్‌లో కరోనా కలకలం.. 10 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్.. ఆందోళనలో సిబ్బంది
Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా..తాజాగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి
Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గతంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా..తాజాగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ఇక ఏపీ ఆర్టీపీ ప్రధాన కార్యాయలంలో కరోనా కలకలం రేపుతోంది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్ భవన్‌లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో ఆరుగురు ఉన్నతాధికారులకు కరోనా పాజిటివ్ ముందుగా నిర్ధారణ కాగా, వీరి ద్వారా మరి కొందరి సిబ్బందికి పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. కాగా, నాలుగు రోజుల కిందట హైదరాబాద్ రామచంద్రాపురం బస్సు డిపో ప్రారంభం కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీరికి హైదరాబాద్‌లోనే కరోనా సోకి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 పాజిటివ్ కేసులు నమోదుకాగా, నలుగురు మరణించారు.దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. ఇందులో 7338 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,87,434 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక మొత్తం మరణాల సంఖ్య 7217కు చేరుకుంది. తాజాగా 456 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇవీ చదవండి: వూహాన్ ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచి మనుషులకు సోకింది.. కరోనాపై డబ్ల్యూహెచ్‌వో (WHO) కీలక వ్యాఖ్యలు