Coronavirus: పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 39,544 పాజిటివ్‌ కేసులు.. ఎంత మంది మరణించారంటే..

Coronavirus: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా..

Coronavirus: పెరుగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 39,544 పాజిటివ్‌ కేసులు.. ఎంత మంది మరణించారంటే..
Covid 19
Follow us
Subhash Goud

|

Updated on: Mar 31, 2021 | 10:22 PM

Coronavirus: దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇక మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 39,544 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,227 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 54,649 మంది మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 3,56,243 యాక్టివ్‌ కేసులు ఉండగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 23,600 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 24,00,727 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అలాగే దేశంలో కరోనా కేసులు నమోదవుతున్న జాబితాలో మహారాష్ట్ర ఉండటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో మరింత ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా కొత్తగా కరోనా బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో గడిచిన 24 గంటల్లో 53,480 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు కరోనా బులెటిన్ విడుదల చేసింది. ఇక కరోనా కారణంగా 354 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు 100 నుంచి 200 మధ్యనే ఉన్న కరోనా మరణాల సంఖ్య కరోనా సెకండ్ వేవ్‌లో మరింత పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక 24 గంటల్లో 41,280 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు.

ఇవీ చదవండి: వూహాన్‌ ల్యాబ్‌ నుంచి కాదు.. జంతువుల నుంచి మనుషులకు సోకింది.. కరోనాపై డబ్ల్యూహెచ్‌వో (WHO) కీలక వ్యాఖ్యలు

కరోనావైర‌స్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది.. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచిన సీఎస్ సోమేశ్ ‌కుమార్