ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.?

|

May 08, 2021 | 7:59 PM

Corona Positive Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 1,10,571 శాంపిల్స్‌ పరీక్షించగా..

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.?
Ap Corona
Follow us on

Corona Positive Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం 1,10,571 శాంపిల్స్‌ పరీక్షించగా.. 20,065 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. పాజిటివిటీ రేటు 19.75 శాతం ఉండగా, అత్యధికంగా 96 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,615కి చేరింది.

తూర్పుగోదావరిలో 2370 కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత చిత్తూరులో 2269 , విశాఖ 2525 కరోనా కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమగోదావరిలో 14 మంది చనిపోగా, విశాఖలో 12 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,87,392 యాక్టివ్ కేసులు ఉండగా.. 10,69,432 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 7065 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 6300లకు పైగా పడకలు కరోనా బాధితులతో నిండిపోయాయి.

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందని ఏపీ ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చిత్తూరు జిల్లాలో కరోనా తీవ్రతపై సమీక్షను నిర్వహించామని చెప్పారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల లభ్యతపై చర్చించామని తెలిపారు. రాష్ట్రానికి 500 టన్నుల ఆక్సిజన్ మాత్రమే వస్తోందని… ఇందులో చిత్తూరు జిల్లాకి 40 టన్నుల ఆక్సిజన్ ను పంపుతున్నామని చెప్పారు. ఈ రెండు ఆసుపత్రుల్లో సమస్యలు లేకుండా చేస్తామని తెలిపారు.

కరోనా సెంటర్ల సంఖ్యను పెంచితే సమస్య తగ్గుతుందని… ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆళ్ల నాని చెప్పారు. అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని బెడ్లను ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోందని… కేంద్రం పంపుతున్న వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు వేస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ కొరత వల్లే కరోనా పేషెంట్లు కోవిడ్ సెంటర్లకు వెళ్లకుండా ఆసుపత్రులకు వస్తున్నారని అన్నారు.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!