AP Corona Cases: ఏపీలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో తగ్గని మరణాల ఉద్ధృతి.!

|

Jun 04, 2021 | 6:15 PM

చిత్తూరు జిల్లాలో కోవిడ్ మరణాల ఉద్ధృతి తగ్గట్లేదు. గడిచిన 24గంటల్లో ఈ జిల్లాలో మరో 14 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. కొన్ని..

AP Corona Cases: ఏపీలో కాస్త తగ్గిన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో తగ్గని మరణాల ఉద్ధృతి.!
Coronavirus Cases In AP
Follow us on

చిత్తూరు జిల్లాలో కోవిడ్ మరణాల ఉద్ధృతి తగ్గట్లేదు. గడిచిన 24గంటల్లో ఈ జిల్లాలో మరో 14 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎక్కువ కరోనా మరణాలు ఇక్కడే నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 665 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. అందులో 98 మంది చిత్తూరు జిల్లాలోనే మరణించారు.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో గరిచిన 24 గంటల్లో 85,311 నమూనాలు పరీక్షించగా 10,413 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొత్తగా 83 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,296కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 17,38,990కు పెరిగింది. అటు రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం ప్రజలకు ఊరటను ఇస్తోంది. నిన్న 15,469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,33,773కు తగ్గాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 15,93,921 మంది మహమ్మారిని జయించారు.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?