Konaseema: మండుటెండల్లో.. మంచు కురిసేదెందుకో.. కోనసీమలో విచిత్ర పరిస్థితులు..

|

Apr 18, 2023 | 9:14 AM

వేసవి వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభమైపోయింది. పలు ప్రాంతాల్లో ఎండల వేడికి జనం అల్లాడుతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే, మండుతున్న వేసవిలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది.

Konaseema: మండుటెండల్లో.. మంచు కురిసేదెందుకో.. కోనసీమలో విచిత్ర పరిస్థితులు..
Weather Updates
Follow us on

వేసవి వచ్చేసింది. ఎండాకాలం ప్రారంభమైపోయింది. పలు ప్రాంతాల్లో ఎండల వేడికి జనం అల్లాడుతున్నారు. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అయితే, మండుతున్న వేసవిలో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఉదయాన్నే అక్కడ మంచు కమ్మేస్తోంది.. ఇదీ ఏమైనా శీతాకాలామా అనే డౌట్‌ కలిగిస్తోంది..? అక్కడున్న పరిస్థితులు చూస్తుంటే మీరే నమ్మరు.. సరిగ్గా ఉదయం పది దాటితే మాడుపగిలేలా ఎండ దంచికొడుతుంది.. అదే ఉదయాన్నే సూర్యుడు ఇంకా పొద్దు పొడవకముందే వచ్చే మంచు చూస్తుంటే అక్కడి ప్రాంత ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. ఎండలు దంచికోడుతున్న వేళ.. మంచు కురవడం ఏంటీ.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

శీతాకాలంలో మంచు కురవడం కామన్.. కానీ.. ఎండాకాలంలో మంచు ఏంటని ముమ్మిడివరం వాసులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో ఉదయం మంచు.. తర్వాత సూర్యుడు భగభగలు.. ఈ విచిత్ర వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు సూర్యుడి ప్రతాపం.. మరోవైపు ఉదయమే మంచు కమ్మేయడం వంటి పరిస్థితులు ఇక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

గత నాలుగు రోజులుగా చోటుచేసుకున వాతావరణ మార్పులతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు..ఇక కోవిడ్ పాజిటివ్ కేసులు పెరగడానికి వాతావరణ పరిస్థితులే కారణం అంటున్నారు వైద్య నిపుణులు..విచిత్ర వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..