News Watch: ఇవాళ ఏం జరగబోతోంది..? సర్వత్రా ఉత్కంఠ..

News Watch: ఇవాళ ఏం జరగబోతోంది..? సర్వత్రా ఉత్కంఠ..

Shaik Madar Saheb

|

Updated on: Apr 18, 2023 | 8:32 AM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నాలుగేళ్ల తర్వాత స్పీడ్‌ అందుకుంది. కారణాలు ఏవైనా.. సీబీఐ మాత్రం దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్‌గూడ జైలుకి తరలించారు.



 

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నాలుగేళ్ల తర్వాత స్పీడ్‌ అందుకుంది. కారణాలు ఏవైనా.. సీబీఐ మాత్రం దర్యాప్తులో దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి.. వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో.. ఆయన్ను చంచల్‌గూడ జైలుకి తరలించారు. అయితే.. రిమాండ్ రిపోర్ట్‌లో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని సహా నిందితుడిగా సీబీఐ పేర్కొనడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మరోవైపు.. తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. నేటికి వాయిదా పడటంతో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుగనుంది. మధ్యాహ్నం లోపు అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. అదేసమయంలో అవినాష్‌రెడ్డిని ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అలాగే.. సునీత ఇంప్లీడ్ పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారణకు స్వీకరించింది. నేటి ఉదయం ఈ పిటిషన్‌పైనా విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

Published on: Apr 18, 2023 08:32 AM