AP News: రైతన్నలూ జాగ్రత్త.. కోల్డ్ స్టోరేజీల్లో మీ పంట పెడితే ఇలా మోసపోయే అవకాశం ఉంది

వ్యాపారులు, రైతులు నిల్వ ఉంచుతున్న సరుకు ఎంత వరకు భద్రం. కంచె చేను మేసినట్లు మీరు పెట్టిన సరుకు మీకు తెలియకుండా నిర్వాహకులు అమ్మేస్తే. అదేంటి అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? అవునండి ఖచ్చితంగా అక్కడ అలాగే జరిగింది. అది ఎలా అంటారా? ఇదిగో ఇలా..

AP News: రైతన్నలూ జాగ్రత్త.. కోల్డ్ స్టోరేజీల్లో మీ పంట పెడితే ఇలా మోసపోయే అవకాశం ఉంది
Cold Storage Fraud
Follow us
G Koteswara Rao

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 22, 2023 | 8:02 PM

కోల్డ్ స్టోరేజ్ మోసం ఎలా బయటపడింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ముచ్చర్ల వలస వద్ద ఉన్న నారాయణ కోల్డ్ స్టోరేజ్ లో నిర్వాహకులు ఘరానా మోసానికి పాల్పడి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. సాలూరుకు చెందిన ఓ పసుపు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తమకు చెందిన పసుపుని నారాయణ కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసుకుంది. ధర తక్కువగా ఉండటంతో గత రెండేళ్లుగా స్టోర్ లోనే ఉంచింది కంపెనీ యాజమాన్యం. ఎప్పటికప్పుడు స్టోరేజ్ చార్జీలు కూడా కడుతూ వస్తున్నారు. స్టోర్ లో ఉన్న తమ సరుకు భద్రంగా ఉందని అనుకుంటున్నారు సంస్థ ప్రతినిధులు. ఇలా రెండేళ్లు గడిచిపోయాయి. ఎప్పటికప్పుడు సంస్థ ప్రతినిధి కోల్డ్ స్టోరేజ్ సిబ్బందితో మాట్లాడి సరుకు కోసం ఆరా తీస్తున్నారు. సిబ్బంది కూడా అయ్యో మీ సరుకు మా సరుకు కాదా, మీ సరుకు కు మాది పూచీ అని నమ్మబలుకుతూ వస్తున్నారు. సిబ్బంది మాయమాటలు గుర్తించలేకపోయారు కంపెనీ ప్రతినిధులు. ఈ క్రమంలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తి కంపెనీ ప్రతినిధికి కాల్ చేశాడు. మీ సరుకు అంతా మాయమైపోయింది, ఉన్న కొద్దిపాటి సరుకు కూడా కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు ఢిల్లీకి పంపిస్తున్నారు, ఇప్పుడే లారీ లోడ్ అవుతుందని చెప్పారు. దీంతో హుటాహుటిన కోల్డ్ స్టోరేజ్ వద్దకు చేరుకున్నారు పసుపు కంపెనీ యజమాని. అక్కడికి వెళ్లే సరికి అనుకున్నట్లే లారీ లోడ్ అవుతుంది. దీంతో లారీ లోడింగ్ కు అడ్డుపడి పోలీసులకు పిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు కోల్డ్ స్టోరేజ్ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే మొత్తం పసుపులో కోల్డ్ స్టోరేజ్ వారు ఎంత కాజేశారు అన్న అంశం పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన రైతులు, ట్రేడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ముందుగా కోల్డ్ స్టోరేజ్ విశ్వసనీయత ను తెలుసుకోవాలి. తరువాత కోల్డ్ స్టోరేజ్ ల అగ్నిమాపక భద్రత చర్యలు ఏ విధంగా ఉన్నాయో కనుక్కోవాలి. స్టోర్ యాజమాన్యం భాద్యతగా వ్యవహరిస్తున్నారా లేక సిబ్బంది పై వదిలేశారా అని చూసుకోవాలి. తరువాత స్టార్ లో నిల్వ చేసిన మీ సరుకును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచిన సరుకు మీదేనా లేక మీ నాణ్యమైన సరుకు మార్చి నాసిరకం సరుకు పెట్టారా అని చూసుకోవాలి. ఇలా అనేక కోణాల్లో సరి చూసుకొని మీ ప్రొడక్ట్స్ పట్ల జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్రంగా నష్టపోక తప్పదు అనే చెప్పాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..