చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో నాగుపాము ఒక గుడిలో పూజలు అందుకుంది. పందికొట్కూరు గ్రామంలో పాతాళ వినాయక ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన నాగుపాము స్థానికుల్లో భయం కంటే భక్తి భావాన్ని చాటింది. ఆలయంలోనే తిష్ట వేసిన నాగుపాముకు పూజలు, హారతులు ఇచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పాతాళ వినాయక అనుబంధ ఆలయమైన నాగదేవతాలయంలోనే రాత్రి నుంచి నాగుపాము తిష్ట వేసింది.
నిన్న రాత్రి పాతాళ వినాయక స్వామి కైకర్యాలు ముగించుకొని ఆలయానికి తాళం వేస్తున్న సమయంలో ఆలయంలోకి నాగుపాము వచ్చిందంటున్న అర్చకుల ద్వారా విషయం స్థానికులకు తెలిసింది. సాక్షాత్తు నాగదేవత దర్శనమిచ్చిందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న భక్తులు హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. గ్రామంతా నాగుపాము సందడి నేలకొనగా మహిళలు ఆలయానికి వచ్చి పుట్ట వద్ద పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..