CM Jagan: ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్.. ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్..

|

Dec 02, 2022 | 9:56 AM

ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడూ ఇందులో మార్పులు చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో..

CM Jagan: ఆరోగ్య శ్రీ సేవలకు ప్రత్యేక యాప్.. ఉగాది నాటికి విలేజ్ క్లినిక్స్..
Ap Cm Jagan
Follow us on

ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడూ ఇందులో మార్పులు చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన జగన్ సర్కార్.. ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిప్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా యాప్ ఉండాలని సూచించారు. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజలకు అవగాహన కల్పంచాలన్న సీఎం.. ఆరోగ్య శ్రీ సేవల విషయంలో ఏదైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్​ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందో వివరాలన్నీ బాధితులకు తెలియాలన్న ముఖ్మయంత్రి.. ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ చూపేలా యాప్‌ లో మ్యాప్స్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

ఆరోగ్య శ్రీ సేవల విషయంలో తప్పులుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. డయాలసిస్‌ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. ఇందుకోసం తగిన స్థాయిలో సన్నద్ధం కావాలి. ఉగాది నాటికి విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేయాలి.

– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. సీఎం జగన్.. మరోసారి మంచి మనసు చాటుకున్నారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో నాలుగో దశ జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ఓ బాలుడి పరిస్థితి చూసి చలించిపోయారు. మొహ్మద్ అలీ అనే బాలుడు దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకుని వెంటనే బాధిత బాలుడి తల్లికి ఆర్థిక సహాయం చేయాలని ఆదేశించారు. నెలవారి పెన్షన్‌ వచ్చేలా చూడాలని, చిన్నారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..