CM Jagan: ‘దేశం మొత్తం ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది’.. ఐ ప్యాక్ టీంను కలిసిన సీఎం జగన్..

|

May 16, 2024 | 1:13 PM

ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్. మే 16న గురువారం ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‎లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్ కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐ ప్యాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్.

CM Jagan: దేశం మొత్తం ఏపీ ఫలితాలు చూసి షాక్ అవుతుంది.. ఐ ప్యాక్ టీంను కలిసిన సీఎం జగన్..
Cm Jagan
Follow us on

ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సీఎం జగన్. మే 16న గురువారం ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్‎లో ఉన్న ఐ ప్యాక్ ఆఫీస్ కు చేరుకుని ఆ టీంను కలిసి కృతజ్ఙతలు చెప్పారు. సీఎం జగన్ రాక నేపథ్యంలో ఐ ప్యాక్ టీం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ కోసం పనిచేసినందుకు ఐ ప్యాక్ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో బెంజ్ సర్కిల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన పోలింగ్ శాతం, విజయావకాశాలపై ఐ ప్యాక్ ప్రతినిధులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీకి విజయావకాశాలు ఏ మేర ఉన్నాయి అనే దానిపై సమాచారం అడిగి తెలుసుకునేందుకు అక్కడకు చేరకున్నారన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నారు.

అయితే ఐ ప్యాక్ టీంతో మాట్లాడిన తరువాత సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఏపీలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. గతంలో కంటే కూడా ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాదిన్నర కాలంగా ఐప్యాక్ టీం అందించిన సేవలు వెలకట్టలేనివని సంస్థ చేసిన కృషిని కొనియాడారు. ఎంపీ సీట్లు కూడా గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పారు. ఈ సారి ఏపీలో వచ్చే ఫలితాలను చూసి దేశం షాక్ అవుతుందని చెప్పారు. ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలనను అందించబోతున్నామని తెలిపారు. 2019లో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు వస్తాయని ఎవ్వరూ నమ్మలేదని గతాన్ని గుర్తు చేశారు. ప్రజలు సుపరిపాలనను చూసి మద్దతు ఇచ్చారన్నారు.

 

ఇవి కూడా చదవండి

గతం 2019 ఎన్నికల్లో కూడా సీఎం జగన్ విజయానికి ఈ ఐ ప్యాక్ టీం ఎంతగానో దోహద పడింది. ఈ సారి సీఎం జగన్ చేపట్టిన యాత్రలు, ప్రచార వేదికలు, నియోజకవర్గాల్లో మీటింగ్ లను ఈ సంస్థ నిర్ణయించింది. ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి గ్రౌండ్ లెవలె రియాలిటీని పరిశీలించి ఇలా ప్రత్యేకంగా సభలు, సమావేశాలు రూపొందించింది. ఐ ప్యాక్ టీం అందించిన ప్రణాళిక అధారంగానే సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా ముగించారు. దీని ప్రభావం ఏపీలో పోలింగ్ శాతం భారీ స్థాయిలో పెరిగింది. అయితే పోలింగ్ జరిగిన శైలిపై ప్రతి ఒక్కరిలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నాయకులు తమకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ ప్రముఖ రాజకీయ పరిస్థితులను అవగాహన వేసే ఐ ప్యాక్ టీం ప్రతినిధులను కలవడం ప్రత్యేకత సంతరించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..