AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఆదాయాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని సీఎం వైఎస్.జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ,...

Andhra Pradesh: ఆదాయాలు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలి.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం
Cm Ys Jagan
Ganesh Mudavath
|

Updated on: Jul 25, 2022 | 7:09 PM

Share

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని సీఎం వైఎస్.జగన్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయం సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమావేశమయ్యారు. పన్నుల వసూలులో పారదర్శకత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ (CM Jagan) సూచించారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలన్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని అధికారులను ఆదేశించారు. బెల్టు షాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులు కీలకపాత్ర వహిస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి. సబ్‌ రిజిస్ట్రార్‌, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్‌ పెట్టాలి. 14400 ఏసీబీ నెంబరుతో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలి. ఫోన్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టుపై కూడా పక్కాగా ఉండాలి. త్వరలోనే రెడ్‌ శాండిల్‌ ఆక్షన్‌– గ్లోబల్‌ టెండర్‌ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయి. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించింది. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి.

   – వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. భారీ వర్షాలు, వరదలతో గోదారమ్మ ఉగ్ర రూపం దాల్చింది. గోదావరి నదీ(Godavari River) పరివాహక గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. బాధితులకు అండగా ప్రజాపత్రినిధులు పర్యటన చేస్తున్నారు. బాధితులకు ధైర్యాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి(జూలై 26వ తేదీ) సీఎం జగన్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. బాధిత ప్రాంతాలను పరిశీలించి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. పి. గన్నవరం మండలంలోని పలు గ్రామాలతో పాటు, లంకల గన్నవరం, మానేపల్లిలో వరద బాధితులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..