CM Chandrababu: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..

|

Jul 25, 2024 | 3:53 PM

ఏపీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు..గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గతప్రభుత్వం పనితీరును సీఎం చంద్రబాబు ఎండగడుతున్నారు. లిక్కర్ పాలసీ విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో 2014-2019 మధ్య లా అండ్ ఆర్ఢర్ సజావుగా సాగేదన్నారు. గతం ఐదేళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నారు.

CM Chandrababu: ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరపరిణామం.. నవ్వులు పూయించిన సీఎం చంద్రబాబు..
Cm Chandrababu
Follow us on

ఏపీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబునాయుడు..గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసులను అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. గతప్రభుత్వం పనితీరును సీఎం చంద్రబాబు ఎండగడుతున్నారు. లిక్కర్ పాలసీ విధానంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో 2014-2019 మధ్య లా అండ్ ఆర్ఢర్ సజావుగా సాగేదన్నారు. గతం ఐదేళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నారు. అందుకు నిర్శనంగా ఒక సరికొత్త సాంప్రదాయాన్ని తెరపైకి తెచ్చారు.

ఈ సందర్భంగా కేసులున్న ప్రజాప్రతినిధులు లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు కోరారు. దాంతో మెజార్టీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అనంతరం కేసులు లేని వారు కూడా లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు కోరగా.. అతి తక్కువ సంఖ్యలో సభ్యులు నిల్చోవడంతో సభలో నవ్వులు విరిశాయి. కేసులు లేని వాళ్లు పుణ్యాత్ములు అంటూ చమత్కారంగా చెప్పారు. గతంలో రాజకీయ పోరాటం చేసిన వారందరిపై కేసులు పెట్టారని.. మెజార్టీ సంఖ్యలో బాధితులు ఉన్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే వీరందరినీ ప్రజలు గమనిస్తూ.. నాయకులుగా పరిగణించారని తెలిపారు. అందుకే ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపించిరని ఇదే ఇక్కడ గమనించవల్సిన గొప్ప విషయం అని కొనియాడారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..