Heavy Rains: పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!

Heavy Rains: పొంగుతున్న వాగులు, వంకలు.. గిరిజనుల అవస్థలు.!

Anil kumar poka

|

Updated on: Jul 25, 2024 | 3:37 PM

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉత్తర కోస్తా అంతటా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కోస్తాలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించారు. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున... నాలుగురోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో మరో మూడ్రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఉత్తర కోస్తా అంతటా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కోస్తాలోనూ అక్కడక్కడా వర్షాలు పడతాయని వెల్లడించారు. తీరం వెంబడి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున… నాలుగురోజుల పాటు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లోనే రోడ్డుసదుపాయం లేక నానా అవస్థలు పడే గిరిజనులకు భారీవర్షాలతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నిత్యావసరాల కోసం గిరిజనులు తాళ్ల సాయంతో వాగులు దాటుతున్నారు. పాడేరు ఏజెన్సీలో భారీ వర్షంతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల చెట్లు విరిగిపడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంధకారంలోనే ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరోవైపు గుంటవాడ రిజర్వాయర్‌కు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత నీటిమట్ట 1358.7 అడుగులకు చేరుకుంది. డ్యామ్‌ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేసే పరిస్థితి కనిపిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.