TDP Mahanadu: ఎన్టీఆర్ టు లోకేశ్..! 5 పాయింట్ ఫార్ములాతో పసుపు పండగ
సగటు టీడీపీ కార్యకర్త నుంచి పార్టీలోని సీనియర్ లీడర్ దాకా.. అందరి నుంచి ఓ మాట అయితే వినిపించింది. 40 ఏళ్లుగా మహానాడుకు వస్తున్నా.. ఈసారి చూసిన మహానాడుకు మాత్రం ఏదో కొత్తదనం అనే మాట అది. ఈ పసుపు పండగ.. ఇప్పటివరకు జరిగిన వాటిలా కాదనే చర్చ అది.

సగటు టీడీపీ కార్యకర్త నుంచి పార్టీలోని సీనియర్ లీడర్ దాకా.. అందరి నుంచి ఓ మాట అయితే వినిపించింది. 40 ఏళ్లుగా మహానాడుకు వస్తున్నా.. ఈసారి చూసిన మహానాడుకు మాత్రం ఏదో కొత్తదనం అనే మాట అది. ఈ పసుపు పండగ.. ఇప్పటివరకు జరిగిన వాటిలా కాదనే చర్చ అది. ఈ మహానాడు రాష్ట్ర రాజకీయాల్లో కచ్చితంగా ఓ కీలక మలుపు తిప్పిందనే మాట్లాడుకుంటున్నారు. నేరుగా ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ.. స్వయంగా చంద్రబాబే చెప్పీ చెప్పకుండా ప్రస్తావించారు ఆ విషయాన్ని. ఇంతకీ ఏంటది? తెలుగుదేశం పార్టీకి ఇదొక ట్రాన్సిషన్ పిరియడ్. తనను తాను కొత్తగా మార్చుకోవాల్సిన సందర్భం ఇది. దానికి సంబంధించిన వేదికే.. మూడు రోజుల పాటు జరిగిన మహానాడు. కడప మహానాడును ఒక మార్పుకు సంకేతంగా ఉపయోగించుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మాట్లాడిన ప్రతి మాట, మహానాడు వేదికగా వేసిన ప్రతి అడుగు, ప్రతీ చర్య.. మార్పును సూచించింది. అదేంటో కార్యకర్తలకు అర్థమయింది.. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతోంది. కడప మహానాడు 5 పాయింట్ ఫార్ములాతో సాగింది. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది.. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదం. నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు సూత్రాల్లో ఒకటే ఈ ‘కార్యకర్తే అధినేత’. ఒకరకంగా నారా లోకేశ్ మానసపుత్రిక ఈ నినాదం. ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ.. మంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నప్పటికీ.. తన మనసుకు నచ్చేది మాత్రం పార్టీ కార్యకర్తలేనంటూ చెప్పుకుంటూ వస్తున్నారు మొదటి...




