గ్రామీణ రైతుబిడ్డ జాతీయస్థాయి అందాల పోటీలకు ఎంపికైంది. తన అందం, ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచింది. మరో రెండు వారాల్లో ముంబైలో నిర్వహించనున్న మిస్ ఇండియా పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, ఎం.కె.పురంనకు చెందిన చందనా జయరాం ఈ ఘనత సాధించింది.
చందనా జయరాం ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుండి ఎంపికయ్యారు. ముంబైలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో ఏపీ నుండి చందనా పాల్గొననున్నారు.
శాంతిపురం మండలానికి చెందిన చందన జయరామ్ మిస్ యూనివర్స్ ఆంధ్రగా ఎంపికయ్యింది. కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఎంకేపురంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన చందన జయరామ్ హైదరాబాద్ లో టూరిజం-హాస్పటాలిటీ కోర్సు పూర్తి చేసింది
అభినందించిన సీఎం చంద్రబాబు
కుప్పం నుంచి చందనా జయరాం మిస్ యూనివర్స్-ఇండియా పోటీలకు అర్హత సాధించడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. మిస్ యూనివర్స్ – ఇండియాకు ఏపీ నుండి అర్హత సాధించిన చందన జయరాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని శుక్రవారం తన తల్లితండ్రుల తో కలిసి సచివాలయంలో కలిశారు. చంద్రబాబు స్థానిక కుప్పం శాసనసభ్యుడు కూడా కావడంతో తన నియోజవర్గ యువతి సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..