AP vs TS Fishermen: ఏపీ, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ.. వివాదానికి కారణం ఇదే..!
AP vs TS Fishermen: రింగ్ వలలు తెలుగు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టాయి. దాడులు చేసుకునేవరకు వెళ్లింది రింగ్ వలల వివాదం. పోలీసుల ఎంట్రీతో..
AP vs TS Fishermen: రింగ్ వలలు తెలుగు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య చిచ్చుపెట్టాయి. దాడులు చేసుకునేవరకు వెళ్లింది రింగ్ వలల వివాదం. పోలీసుల ఎంట్రీతో కాస్త సద్దుమణిగింది. రింగ్ వలల వివాదం ఇన్నాళ్లు ఏపీలోని రెండు గ్రూపుల మధ్య జరిగేది. కానీ, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నాయి. తాజాగా, నల్గొండ జిల్లాలో ఏపీ, తెలంగాణ మత్స్యకారుల మధ్య ఘర్షణ జరిగింది. నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో గొడవకు దిగారు ఇరు రాష్ట్రాల మత్స్యకారులు. రింగ్ వలలు వేయొద్దని తెలంగాణ మత్స్యకారులు చెప్పడంతో గొడవ మొదలైంది. ఇది కాస్త ముదిరి పరస్పరం రాళ్లు రువ్వుకునే వరకు వెళ్లింది. దీంతో సరిహద్దు గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. తాము ఏడాది కాలంలో పట్టుకునే చేపలు, ఏపీ మత్స్యకారులు రింగ్ వలలతో కేవలం నెల రోజుల్లోనే పట్టుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు తెలంగాణ మత్స్యకారులు.
కాగా, రింగ్ వలలు విషయంలో కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మత్స్యకారుల మధ్య వివాదం జరుగుతోంది. ఈ వివాదంలో నలుగురు ఏపీ మత్స్యకారులను పట్టుకొని, చందంపేటకు తీసుకొచ్చారు తెలంగాణ మత్స్యకారులు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు వచ్చి వారిని విడిపించుకొని వెళ్లారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి వివాదం సద్దు మణిగింది.