తిరుపతి జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా పట్టుపడింది. గంజాయి స్మగ్లర్లు పుష్ప సినిమా సీన్ రిపీట్ చేశారు. పుష్ప సినిమాలో అల్లుఅర్జున్ ఎర్రచందనం దుంగలను తెలివిగా తరలించినట్లు.. సేమ్ టూ సేమ్ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడ్డారు. గంజాయి స్మగ్లింగ్ కోసం బొలెరో వాహనాన్ని రీ మోడల్ చేశారు. అనకాపల్లి, విశాఖల నుంచి శ్రీలంకకు అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హెండ్‌డ్‌గా పట్టుకున్నట్లు చెప్పారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. సూళ్లూరుపేట వద్ద వాహన తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న ఒక బొలెరో, ఇన్నోవా ట్రక్‌ను పట్టుకొని సీజ్ చేశారు పోలీసులు. 280 కేసుల గంజాయితో పాటు సెల్‌పోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 48 లక్షలు విలువచేసే 120 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితులు ఆనంద వేలు, బాలకిషన్, తిరుమలతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ గంజాయి రవాణాలో ప్రధాన నింధితుడు ఆనందవేలుపై రాజమండ్రి,విజయవాడ, తమిళనాడులో కేసులు నమోదయ్యాయని చెప్పారు ఎస్పీ. ఇతనికి అనకాపల్లిలో అప్పలనాయుడు అనే వ్యక్తి గంజాయి సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. అప్పలనాయుడు తన అనుచరులతో ఒరిస్సా బార్డర్ నుంచి సేకరిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. ఈ గంజాయి స్మగ్లింగ్ అప్పలనాయుడు టూ ఖాదర్ వయా ఆనందవేలుగా సాగుతుందన్నారు. చెన్నై నుంచి శ్రీలంకకు సప్లై చేసే ఖాదర్ తో పాటు.. ఆనందవేలుకు సప్లై చేసే అప్పలనాయుడు కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి.
హైదరాబాద్ రాచకొండ పరిధిలో రెండు అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలని అరెస్ట్ చేశారు చౌటుప్పల్ పోలీసులు. SOT పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. గంజాయి ముఠాని ఛేజ్ చేఇ పట్టుకున్నారు. వారి నుంచి 65 లక్షల రూపాయలు విలువ చేసే 220 కేజీల గంజాయి పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి మహారాష్ట్ర లోని సోలాపూర్ కి ఈ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు పోలీసులు. హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ పై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోందని తెలిపారు పోలీసులు.